logo

Nalgonda: గనుల వేలాన్ని నిరసిస్తూ కలెక్టరేట్ ఎదుట ధర్నా

ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటుపరం చేసే కేంద్ర ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ కలెక్టరేట్ ఎదుట సీఐటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.

Updated : 29 Jun 2024 21:42 IST

భువనగిరి: ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటుపరం చేసే కేంద్ర ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ కలెక్టరేట్ ఎదుట సీఐటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. మంచిర్యాల జిల్లాలో శ్రావణపల్లిలో ఉన్న బొగ్గు గనులను కేంద్ర ప్రభుత్వం వేలంపాటలో ప్రైవేటు రంగానికి అప్పజెప్పాలని చూస్తుందని దీనిని వెంటనే ఆపాలని సీపీఎం జిల్లా కార్యదర్శి ఎండీ జహంగీర్ అన్నారు. సింగరేణిని ప్రైవేటీకరణ చేయబోమని బూటకపు మాటలు చెప్పి ఇప్పుడు  ప్రైవేటుపరం చేస్తే ఏమి మిగులుతుందని వారు ప్రశ్నించారు. తెలంగాణ భాజపా ఎంపీలు, ఎమ్మెల్యేలు దీనిపై నోరు మెదపకపోవడం దారుణమన్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నేరుగా వేలంపాట నిర్వహించడం రాష్ట్ర అభివృద్ధి ప్రయోజనాలపై ఆయనకు దృష్టి లేదని వారు విమర్శించారు. రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నరసింహ, అనురాధ, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు మాటూరు బాలరాజు, దోనూరి నర్సిరెడ్డి, తదితరులు ధర్నాలో పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు