logo

Nalgonda: ప్రకృతి వైద్యంతోనే సంపూర్ణ ఆరోగ్యం

సహజ సిద్ధంగా లభించే ఆహారం ద్వారానే సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని ప్రముఖ ప్రకృతి వైద్యుడు డాక్టర్ రామచంద్ర అన్నారు.

Updated : 29 Jun 2024 16:29 IST

భువనగిరి: సహజ సిద్ధంగా లభించే ఆహారం ద్వారానే సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని ప్రముఖ ప్రకృతి వైద్యుడు డాక్టర్ రామచంద్ర అన్నారు. భువనగిరిలో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రకృతి ప్రసాదించిన దివ్య ఔషధాలు ఆహారాలను క్రమం తప్పకుండా తీసుకోవడంతో పాటు జీవనశైలిలో మార్పు చేసుకుంటే వ్యాధుల బారిన పడకుండా ఉంటామన్నారు. రసాయన నిల్వ ఉంచిన ఆహార పదార్థాలు, ప్యాకెట్ ఫుడ్స్ కు దూరంగా ఉండాలని ఆయన సూచించారు. మున్సిపల్ ఛైర్మన్ పోతంశెట్టి వెంకటేశ్వర్లు కార్యక్రమ నిర్వాహకులు మెరుగు మధు, మాటూరి అశోక్, కొత్త బాలరాజ్, ఇమ్రాన్ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని