logo

Nalgonda: ఎమ్మెల్సీని అడ్డుకున్న భాజపా నాయకులు

రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఉద్యోగ నియామకాల ప్రక్రియను చేపట్టాలని డిమాండ్ చేస్తూ బీజేవైఎం భాజపా ఆధ్వర్యంలో భువనగిరి జడ్పీ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు.

Published : 02 Jul 2024 15:18 IST

భువనగిరి: రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఉద్యోగ నియామకాల ప్రక్రియను చేపట్టాలని డిమాండ్ చేస్తూ బీజేవైఎం భాజపా ఆధ్వర్యంలో భువనగిరి జడ్పీ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. జిల్లా పరిషత్ సమావేశంలో పాల్గొనేందుకు వచ్చిన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నను అడ్డుకున్నారు. జాబ్ క్యాలండర్‌ విడుదల చేయడంతో పాటు ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ చేయాలని నినాదాలు చేశారు. ఎమ్మెల్సీనీ అడ్డుకోవడంతో కొంత రసాభాస జరిగింది. పోలీసులు భాజపా నాయకులను అదుపులోకి తీసుకొని స్టేషన్‌కు తరలించారు. అనంతరం ఎమ్మెల్సీ మల్లన్నకు పార్టీ నాయకులు వినతిపత్రం సమర్పించారు. భాజపా నాయకులు నర్ల నర్సింగ్ రావు, రత్నపురం శ్రీశైలం, మాయ దశరథ, సంతోష్ తదితరులు ఆందోళనలో పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని