logo

మల్గిలో దారుణం!

అన్నదమ్ముల మధ్య తలెత్తిన ఆస్తి తగాదా హత్యకు దారితీసింది. ఇంట్లో సోదరుల వాటాను కొనుగోలు చేసినా... రిజిస్ట్రేషన్‌ చేయకపోవడంతో జరిగిన గొడవల్లో సొంత అన్నపై సోదరుడు కర్రలు, బండరాళ్లతో దాడి చేయడంతో తీవ్రంగా గాయపడి ఆసుపత్రికి తరలించేలోపే మృత్యువాత పడిన ఘటన సంగారెడ్డి జిల్లా న్యాల్‌కల్‌ మండలం మల్గిలో మంగళవారం చోటుచేసుకుంది.

Updated : 03 Jul 2024 06:02 IST

ఆస్తి తగాదాల్లో అన్నను కొట్టి చంపిన సోదరులు

హతుడు బాబు

జహీరాబాద్‌ అర్బన్‌ (న్యాల్‌కల్‌): అన్నదమ్ముల మధ్య తలెత్తిన ఆస్తి తగాదా హత్యకు దారితీసింది. ఇంట్లో సోదరుల వాటాను కొనుగోలు చేసినా... రిజిస్ట్రేషన్‌ చేయకపోవడంతో జరిగిన గొడవల్లో సొంత అన్నపై సోదరుడు కర్రలు, బండరాళ్లతో దాడి చేయడంతో తీవ్రంగా గాయపడి ఆసుపత్రికి తరలించేలోపే మృత్యువాత పడిన ఘటన సంగారెడ్డి జిల్లా న్యాల్‌కల్‌ మండలం మల్గిలో మంగళవారం చోటుచేసుకుంది. హద్నూర్‌ ఎస్‌ఐ రామానాయుడు, బాధిత కుటుంబీకులు తెలిపిన వివరాలు.. మల్గికి చెందిన తెనుగు బాబు(45) తన తల్లి పేరిట ఉన్న ఇల్లును పది నెలల కిందట ముగ్గురు సోదరుల వాటాలను రూ.10 లక్షలకు కొనుగోలు చేశాడు. ఇంటిని రిజిస్ట్రేషన్‌ చేసి ఇవ్వాలని కోరుతున్నా సోదరులు పట్టించుకోకపోవడంతో ఇటీవల పొలం వద్ద గొడవ జరిగింది. మంగళవారం స్థానికంగా ఓ దుకాణం వద్ద బాబు టీ తాగుతుండగా ఒక సోదరుడు వైద్యనాథ్‌ కుటుంబ సభ్యులతో వచ్చి కర్రలు, బండరాళ్లతో బాబుపై విచక్షణారహితంగా దాడి చేశారు. తీవ్ర గాయాలతో రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతున్న బాబు విషయాన్ని తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఆయనను హుటాహుటిన కర్ణాటకలోని బీదర్‌ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతిచెందినట్లు చెప్పారు. ఘటనపై బాబు భార్య శ్రీదేవి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని, నిందితులు పరారీలో ఉన్నారని ఎస్‌ఐ పేర్కొన్నారు. బాబుకు భార్య, ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు.

రోదిస్తున్న భార్య శ్రీదేవి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని