logo

Success Story: ప్రభుత్వ కొలువు.. ఆయనకు పరమ సులువు

అప్పటికే ఐదు ప్రభుత్వ ఉద్యోగాలు పొందినా యువకుడు తృప్తి చెందలేదు. అందరిలో ఒకడిగా కాకుండా కొందరిలో ఒకడిగా ఉండాలనేది అతడి దృఢనిశ్చయం.

Updated : 01 Jul 2024 10:11 IST

తల్లిదండ్రులతో రామేశ్వర్‌

న్యూస్‌టుడే, నారాయణఖేడ్‌: అప్పటికే ఐదు ప్రభుత్వ ఉద్యోగాలు పొందినా యువకుడు తృప్తి చెందలేదు. అందరిలో ఒకడిగా కాకుండా కొందరిలో ఒకడిగా ఉండాలనేది అతడి దృఢనిశ్చయం. అతడే సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలం బోర్గి గ్రామానికి చెందిన ఫూల్‌సింగ్, సుమన్‌బాయి దంపతుల కుమారుడు రామేశ్వర్‌. 5వ తరగతి వరకు నారాయణఖేడ్‌లో తర్వాత నల్లవాగు గురుకులంలో విద్య అభ్యసించారు. ఇంటర్‌ను నర్సాపూర్‌లో చదివి బీవీఆర్‌ఐటీ కళాశాలలో బయోమెడికల్‌ ఇంజినీరింగ్, ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎంటెక్‌ పూర్తిచేశారు. అనంతరం నియామక పరీక్ష రాసి సిర్గాపూర్‌ మండలం వంగ్దాల్‌ పంచాయతీ కార్యదర్శిగా పది నెలల పాటు చేశారు. తర్వాత వివిధ ఉద్యోగ నియామక పరీక్షలు రాసి ఏఆర్‌ కానిస్టేబుల్, పాలిటెక్నిక్, ఐఐటీలో లెక్చరర్లుగా.. గ్రూప్‌4 ఉద్యోగాన్నీ ఆయన సాధించారు. కంది ఐఐటీలో విధులు నిర్వర్తిస్తూనే ఇటీవల నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ ఆధ్వర్యంలో నిర్వహించిన పరీక్షలో ఉత్తమ ర్యాంకు పొంది ‘బయోమెడికల్‌ డిపార్ట్‌మెంట్’లో పేటెంట్ అధికారిగా అర్హత సాధించారు. ఈ పేటెంట్‌ అధికారి పోస్టులు ముంబయి, కోల్‌కతా, దిల్లీ, చెన్నైలలో మాత్రమే ఉంటాయి. తన చదువుకు మరింత విలువ పెంచే ఈ పేటెంట్‌ అధికారి ఉద్యోగంలో త్వరలో చేరుతానని రామేశ్వర్‌ చెప్పారు. ఇలాంటి ఉద్యోగాలేవైనా ఏకాగ్రతతో చదివితే సాధ్యం కావడం సులభమేనన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని