logo

కుటుంబ భారం మోస్తూనే సాధన

అందరూ కలలు కంటారు.. కొందరే విజేతలుగా నిలుస్తారు. వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన యువకుడు రైతుల జీవనాధారమైన నీటిపారుదల వ్యవస్థలో సేవలు అందించాలనే లక్ష్యంతో ముందడుగు వేసి ఏఈఈగా ఉద్యోగం సాధించారు.

Published : 01 Jul 2024 01:18 IST

ఎ.వాసుదేవ్‌ను సన్మానిస్తున్న గ్రామస్థులు

మనూరు, న్యూస్‌టుడే: అందరూ కలలు కంటారు.. కొందరే విజేతలుగా నిలుస్తారు. వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన యువకుడు రైతుల జీవనాధారమైన నీటిపారుదల వ్యవస్థలో సేవలు అందించాలనే లక్ష్యంతో ముందడుగు వేసి ఏఈఈగా ఉద్యోగం సాధించారు. సంగారెడ్డి జిల్లా నాగల్‌గిద్ద మండలం కరస్‌గుత్తి గ్రామానికి చెందిన అల్లపూరే దయానంద్‌రావు-శకుంతలబాయిల ముగ్గురు సంతానంలో పెద్ద కుమారుడు వాసుదేవ్‌. తమ్ముడు అంబదాస్, చెల్లి లత ఉన్నారు. దయానంద్‌రావు గతంలోనే అనారోగ్యంతో మృతి చెందడంతో కుటుంబ భారమంతా పెద్దవాడైన వాసుదేవ్‌పైనే పడింది. వ్యవసాయం కుటుంబం కావడంతో కష్టపడితేనే పూట గడిచే పరిస్థితి ఏర్పడింది. ప్రతిభ చాటితే కష్టాలు దూరమవుతాయని చిన్నప్పటి నుంచే శ్రద్ధతో విద్యాభ్యాసం కొనసాగించారు. పాఠశాల స్థాయి వరకు కరస్‌గుత్తి, నారాయణఖేడ్‌ ప్రభుత్వ పాఠశాలల్లో చదివారు. ఇంటర్, బీటెక్‌ మెకానికల్‌ ఇంజినీరింగ్‌ను హైదరాబాద్‌లో పూర్తి చేశారు. టీజీపీఎస్‌సీ ఉద్యోగాల నియామక పరీక్ష నిర్వహించగా ప్రతిభ చాటి అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌గా రాష్ట్రంలోనే 38వ ర్యాంకుతో ఎంపికయ్యారు. చిన్నవయసులోనే నీటి పారుదల శాఖలో ఏఈఈగా కొలువు పొందడంతో వాసుదేవ్‌ను గ్రామస్థులు, స్నేహితులు సత్కరించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని