logo

సిలిండర్‌ రాయితీకి ఎదురుచూపులు

పేద, మధ్య తరగతి కుటుంబాల్లో వంట గ్యాస్‌ సిలిండర్ల భారం మోయలేని విధంగా మారుతోంది. కొన్నేళ్లుగా గ్యాస్‌ ధరలు అంతకంతకూ పెరుగుతుండటమే ప్రధాన కారణం. దీని నుంచి సామాన్య ప్రజలకు ఊరట కలిగించాలనే ఉద్దేశంతో...కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రాగానే పేదలకు రూ.500లకే సిలిండర్‌ ఇస్తామని అసెంబ్లీ ఎన్నికల్లో హామీ ఇచ్చింది.

Updated : 29 Jun 2024 05:44 IST

న్యూస్‌టుడే, మెదక్‌ టౌన్‌

పేద, మధ్య తరగతి కుటుంబాల్లో వంట గ్యాస్‌ సిలిండర్ల భారం మోయలేని విధంగా మారుతోంది. కొన్నేళ్లుగా గ్యాస్‌ ధరలు అంతకంతకూ పెరుగుతుండటమే ప్రధాన కారణం. దీని నుంచి సామాన్య ప్రజలకు ఊరట కలిగించాలనే ఉద్దేశంతో...కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రాగానే పేదలకు రూ.500లకే సిలిండర్‌ ఇస్తామని అసెంబ్లీ ఎన్నికల్లో హామీ ఇచ్చింది. అధికారంలోకి రాగానే ఫిబ్రవరి నుంచి మహాలక్ష్మి పథకంలో భాగంగా రాయితీ రూపంలో రూ.500లకే గ్యాస్‌ సిలిండర్‌ను సరఫరా చేస్తున్నారు. కానీ ప్రస్తుతం జిల్లాలో పలువురు అర్హులైన లబ్ధిదారులకు రాయితీ డబ్బులు వారి ఖాతాలో జమకావడం లేదు.

ఏజెన్సీల చుట్టూ తిరుగుతూ.. జిల్లా వ్యాప్తంగా ఉన్న 16 గ్యాస్‌ ఏజెన్సీల పరిధిలో 2.35 లక్షల కనెక్షన్లు ఉన్నాయి. నిత్యం సుమారుగా 3 వేలకు పైగా సిలిండర్లను రీఫిల్లింగ్‌ చేసుకుంటున్నారు. ఇందుకు లబ్ధిదారులు గ్యాస్‌కు పూర్తి ధర చెల్లిస్తున్నారు. మహాలక్ష్మి పథకంలో భాగంగా రూ.500లకు అదనంగా చెల్లించిన డబ్బులు రాయితీ రూపంలో లబ్ధిదారుల ఖాతాలో ప్రభుత్వం జమ చేస్తుంది. కానీ ఏజెన్సీ నిర్వాహకులు, అధికారుల నిర్లక్ష్యంతో రాయితీ డబ్బులు అందడం లేదు. సిలిండర్‌ తీసుకొని నెల, రెండు నెలలు గడుస్తున్నా.. రాయితీ డబ్బులు ఖాతాలో జమకావడం లేదు. లబ్ధిదారుల నంబర్‌ ఆన్‌లైన్‌లో నమోదు చేసే క్రమంలో అవకతవకలు జరుగుతున్నాయా? లేక పొరపాటు చేస్తున్నాయనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. రాయితీ డబ్బుల కోసం లబ్ధిదారులు ఏజెన్సీల చుట్టూ తిరగాల్సి వస్తోంది. సక్రమంగా అందేలా చూడాలని పలువురు కోరుతున్నారు.

  • జిల్లా వ్యాప్తంగా ఉన్న గ్యాస్‌ ఏజెన్సీలు: 16
  • మొత్తం కనెక్షన్లు: 2,35,412
  • దీపం: 63,161
  • ఉజ్వల: 33,618
  • ఇతర: 1,38,633

కార్యాలయంలో సరి చేసుకోండి

- లక్ష్మినర్సింలు, ఎంపీడీవో కొల్చారం

మా వద్దకు వచ్చిన వాటిని సాధ్యమైనంత వరకు సరిచేశాం. ప్రజాపాలనలో ఇచ్చిన రసీదుతో మరోసారి ఎంపీడీవో కార్యాలయానికి వచ్చి తప్పులు ఉంటే సరి చేసుకోండి. అయినప్పటికీ సంబంధిత ఖాతాలో డబ్బులు జమ కాకపోతే ప్రభుత్వం నుంచే పెండింగ్‌ ఉండే అవకాశం ఉంది.


రెండింటి డబ్బులు జమకాలేదు

- విజయ, ఔరంగాబాద్‌

గృహలక్ష్మి పథకంలో భాగంగా ఉన్న గ్యాస్‌ సిలిండర్‌కు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే రాయితీ డబ్బులు బ్యాంకు ఖాతాలో జమ కావడం లేదు. పథకం ప్రారంభమైనప్పటి నుంచి రెండు సార్లు సిలిండర్లను తీసుకున్నాను. ఇంతవరకు డబ్బులు జమ కాలేదు. ఎవరిని అడిగినా తెలియదు అంటున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని