logo

కొత్త పరికరం సిద్ధం.. వేలిముద్ర ఇక భద్రం

ఏ ప్రభుత్వ పథకం అందాలన్నా.. ఈ-కేవైసీ తప్పనిసరి. బయోమెట్రిక్‌ పరికరాల ద్వారా వేలిముద్రలు తీసుకోవాల్సి ఉంటుంది. వేలిముద్రలను పరిరక్షించే తీరులో దుర్వినియోగం అవుతుండటంతో ‘ఆధార్‌’ సంస్థ ప్రత్యేక భద్రతా చర్యలు చేపడుతోంది.

Published : 29 Jun 2024 02:07 IST

వేలిముద్ర సేకరించే పరికరం ఎల్‌1

న్యూస్‌టుడే, గజ్వేల్‌ గ్రామీణ: ఏ ప్రభుత్వ పథకం అందాలన్నా.. ఈ-కేవైసీ తప్పనిసరి. బయోమెట్రిక్‌ పరికరాల ద్వారా వేలిముద్రలు తీసుకోవాల్సి ఉంటుంది. వేలిముద్రలను పరిరక్షించే తీరులో దుర్వినియోగం అవుతుండటంతో ‘ఆధార్‌’ సంస్థ ప్రత్యేక భద్రతా చర్యలు చేపడుతోంది. మీసేవ కేంద్రాలు, కామన్‌ సర్వీస్‌ సెంటర్‌ (సిఎస్‌సి)లలో ప్రస్తుతం వినియోగిస్తున్న బయోమెట్రిక్‌ పరికరాల (ఎల్‌0) స్థానంలో కొత్తవి వినియోగించాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. జులై 1 నుంచి కొత్త పరికరాలు (ఎల్‌1) ఉపయోగించాలని పేర్కొన్నారు.

ఐదు వందలకు పైగా కేంద్రాలు

జిల్లాలో 209 మీసేవ కేంద్రాలు, 310 కామన్‌ సర్వీస్‌ సెంటర్లు, వేలాది మినీ బ్యాంకులు, వివిధ బ్యాంకుల కస్టమర్‌ సర్వీస్‌ పాయింట్లలో లావాదేవీలు జరుగుతున్నాయి. ప్రభుత్వ ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగుల హాజరు ఉపకార వేతనాల కోసం లక్షలాది మంది విద్యార్థులు ఈ-కేవైసీ చేస్తుంటారు. ప్రభుత్వరంగ సంస్థలకు మాత్రం కొత్త పరికరాన్ని కొనుగోలు చేసే ఖర్చును ప్రభుత్వం భరిస్తుంది. ఇప్పటికే అన్ని కేంద్రాల వారూ బయోమెట్రిక్‌ కొత్త పరికరాన్ని కొనుగోలు చేశారు. వేలిముద్రల పరిరక్షణలో భద్రత దృష్ట్యా వచ్చే నెల ఒకటో తారీఖు నుంచి ఎల్‌1 బయోమెట్రిక్‌ పరికరాన్ని వినియోగించడం తప్పనిసరని ఈ-జిల్లా మేనేజర్‌ ఆనంద్‌కుమార్‌ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని