logo

వీధి వ్యాపారులకు భరోసా

పట్టణాల్లోని వీధి వ్యాపారుల ఆర్థిక వృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోంది. ఇప్పటి వరకు రుణాలు అందజేసి.. వ్యాపార పురోగతికి మెప్మా(పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ) అధికారులు చొరవ చూపారు. ఇక నుంచి ఆయా కుటుంబాలకు ప్రభుత్వ పథకాలు సైతం ఇప్పించేలా కార్యాచరణ రూపొందిస్తున్నారు.

Published : 29 Jun 2024 02:04 IST

కుటుంబాల వివరాల సేకరణకు ‘మెప్మా’ ఆదేశం

సంగారెడ్డిలో రహదారుల వెంట వ్యాపారాలు

న్యూస్‌టుడే, సంగారెడ్డి మున్సిపాలిటీ: పట్టణాల్లోని వీధి వ్యాపారుల ఆర్థిక వృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోంది. ఇప్పటి వరకు రుణాలు అందజేసి.. వ్యాపార పురోగతికి మెప్మా(పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ) అధికారులు చొరవ చూపారు. ఇక నుంచి ఆయా కుటుంబాలకు ప్రభుత్వ పథకాలు సైతం ఇప్పించేలా కార్యాచరణ రూపొందిస్తున్నారు. ఇందుకోసం వీధి వ్యాపారుల వివరాలు సేకరిస్తున్నారు. ఇప్పటికే సంగారెడ్డి, జహీరాబాద్‌ పురపాలికల్లో ఈ కార్యక్రమం ప్రారంభం కాగా.. జిల్లాలోని మిగిలిన ఆరు పట్టణాల్లోనూ అమలు చేయనున్నారు. ప్రభుత్వ పథకాలు అందించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం.

ప్రభుత్వ పథకాలు అందించాలని..

జిల్లాలోని 8 పురపాలక సంఘాల్లో 14,238 మంది వీధి వ్యాపారులు ఉన్నారు. వీరికి మెప్మా ద్వారా మొదటి విడత కింద రూ.10 వేలు, రెండో విడత రూ.20 వేలు, మూడో విడత రూ.50 వేల చొప్పున రుణాలు అందించారు. ఈ రుణాలతో చిరు వ్యాపారాలు పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. వీరి ఆర్థిక స్థితిగతులను తెలుసుకునేందుకు పూర్తి స్థాయి సర్వేకు మెప్మా అధికారులు ఆదేశించారు. కుటుంబ సభ్యుల వివరాలు, వారి పిల్లలు చదువుకుంటున్నారా.. ఇతర వ్యాపారం చేస్తున్నారా.. కుటుంబ ఆదాయం.. ఇలా అన్ని రకాల వివరాలు సేకరిస్తున్నారు. జులై చివరి వారం వరకు పూర్తి వివరాలు సేకరించి అంతర్జాలంలో అప్‌లోడ్‌ చేస్తారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఇతర సంక్షేమ శాఖల అధికారులకు పంపిస్తారు. ఆయా శాఖల్లో ఉన్న పథకాలపై వీధి వ్యాపారులకు అవగాహన కల్పించనున్నారు. ఎవరికి ఏయే పథకాలు అనువుగా ఉంటాయో గుర్తించి.. పంపిణీ చేయనున్నారు. వీధి వ్యాపారులు మరిత ఆర్థిక వృద్ధి సాధించేలా అధికారులు పూర్తి స్థాయిలో సహకారం అందిస్తారు. జిల్లాలోని అన్ని పట్టణాల్లో నెల రోజుల్లో పూర్తి వివరాలు సేకరించనున్నామని మెప్మా డీఎంసీ మల్లీశ్వరి తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు