logo

మాదక ద్రవ్యాలకు బానిసలైతే భవిష్యత్తు అంధకారం: ఎస్పీ

అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినం సందర్భంగా బుధవారం జిల్లా వ్యాప్తంగా వివిధ కార్యక్రమాలు నిర్వహించారు.

Updated : 27 Jun 2024 05:56 IST

గోడ పత్రికలు ఆవిష్కరిస్తున్న ఎస్పీ రూపేష్, అదనపు కలెక్టర్‌ చంద్రశేఖర్, జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి రమేశ్, ఆబ్కారీ జిల్లా అధికారి నవీన్‌ చంద్ర తదితరులు 

సంగారెడ్డి అర్బన్, సంగారెడ్డి టౌన్, జోగిపేట, సదాశివపేట, న్యూస్‌టుడే: అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినం సందర్భంగా బుధవారం జిల్లా వ్యాప్తంగా వివిధ కార్యక్రమాలు నిర్వహించారు. కలెక్టరేట్‌లో పోలీస్, మహిళా, శిశు సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ రూపేష్‌ మాట్లాడుతూ మత్తుపదార్థాలు, మాదక ద్రవ్యాలకు బానిసలైతే భవిష్యత్తు అంధకారం అవుతుందన్నారు. విదార్థులు బాగా చదువుకొని తల్లిదండ్రులు, గురువులు, జిల్లాకు మంచి పేరు తేవాలని కోరారు. ఎక్కడైనా.. ఎవరైనా డ్రగ్స్, గంజాయి తదితర మాదక ద్రవ్యాలను వినియోగిస్తున్నట్లు సమాచారం తెలిస్తే టోల్‌ఫ్రీ నంబర్‌ 87126 56777కు సమాచారం ఇవ్వాలని కోరారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు. సదాశివపేటలో సీఐ మహేశ్‌గౌడ్‌ ఆధ్వర్యంలో విద్యార్థులు పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. చౌటకూరు మండలంలోని జేఎన్‌టీయూ కళాశాలలో జరిగిన కార్యక్రమంలో ఆబ్కారీ శాఖ డిప్యూటీ కమిషనర్‌ జె.హరికృష్ణ మాట్లాడుతూ.. మాదక ద్రవ్యాలకు బానిసలైతే జీవితాలు నాశనమవుతాయన్నారు. మాదక ద్రవ్యాల వినియోగం, అక్రమ రవాణా రెండూ నేరమేనని న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి రమేశ్‌ పేర్కొన్నారు. సంగారెడ్డిలోని తారా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు