logo

అద్దెకు వ్యవసాయ పరికరాలు

రైతులు వ్యవసాయం చేసేందుకు ఆసక్తి ఉన్నా కూలీల కొరత తీవ్రంగా వేధిస్తుంది. ఆధునిక యంత్రాలను కొనుగోలు చేయాలంటే అంత ధరలు భరించలేరు.

Updated : 27 Jun 2024 05:55 IST

మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో నిర్వహణ

రోటోవేటర్‌  

న్యూస్‌టుడే, చేగుంట: రైతులు వ్యవసాయం చేసేందుకు ఆసక్తి ఉన్నా కూలీల కొరత తీవ్రంగా వేధిస్తుంది. ఆధునిక యంత్రాలను కొనుగోలు చేయాలంటే అంత ధరలు భరించలేరు. రాయితీలను సైతం నిలిపివేయటంతో సామాన్య రైతులు ఇబ్బందులు  పడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఐకేపీ మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో వ్యవసాయ పరికరాలను అద్దె ప్రతిపాదికన అందజేస్తుంది. కానీ వాటిని రైతులు వినియోగించుకోక చాలా చోట్ల వృథాగా ఉంటున్నాయి. చాలా మంది రైతులు అధిక ధరకు వ్యవసాయ పరికరాలు తెచ్చుకొని వ్యవసాయం చేస్తుంటారు. కానీ ఆర్థికంగా లేనివారి కోసం ఐకేపీ ఆధ్వర్యంలో అద్దెకు అందుబాటులో ఉంచారు. జిల్లాలోని చేగుంట, చిన్నశంకరంపేట, నార్సింగి, నర్సాపూర్, తూప్రాన్, నిజాంపేట, వెల్దుర్తి, పెద్దశంకరంపేట, పాపన్నపేట, రేగోడ్‌ మండలాల్లో ఆధునిక వ్యవసాయ పరికరాలు, యంత్రాల అద్దె కేంద్రాలను ఏర్పాటు చేశారు. రూ.2 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు విలువ చేసే వాటిని మహిళా సమాఖ్య ద్వారా కొనుగోలు చేసి రైతుల కోసం సిద్ధంగా ఉంచారు. బ్రష్‌కట్టర్‌లు, పవన్‌స్ప్రేయర్లను మాత్రమే తీసుకెళ్తున్నారు. మిగతా వాటిపై ఆసక్తి చూపించడం లేదు.

ధరలు ఇలా..

రోటోవేటర్బ్‌రోజుకు రూ.1000. పవర్‌ స్ప్రేయర్ల్బురూ.400, బ్రష్‌కట్టర్బ్‌రూ.500, తైవాన్‌స్ప్బ్రేరూ.1000, డ్రమ్‌సీడర్‌ రూ.500, కల్టివేటర్బ్‌రూ.500, వరికోత యంత్రం రూ.2000, పాడి త్రేషర్బ్‌రూ.1000, ఒక్క ట్రాక్టర్‌ మాత్రమే గంటకు రూ.12000 తీసుకుంటారు. వరి కోత యంత్రంతో చాలా ప్రయోజనం చేకూరుతుంది. అలాగే కలుపుమొక్కలను, గట్ల వెంట ఉండే గడ్డిని కత్తిరించే యంత్రం కూడా ఉన్నాయి. పత్తితీసే సమయంలో కూలీల కొరత ఎక్కువగా ఉంటుంది. పత్తిని తీసే యంత్రం కూడా అందుబాటులో ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో వీటిని అందుబాటులో ఉంచితే కర్షకులకు ఎక్కువగా ఉపయోగం ఉండనుంది. మండల కేంద్రాల్లో మాత్రమే ఉండటం వల్ల వాటిని రవాణా చేయటం అన్నదాతలకు రవాణా ఖర్చు అధికమై మరింత బÅ ారమవుతుంది. 


రైతులు వినియోగించుకోవాలి:  ప్రకాష్, ఐకేపీ డీపీఎం

జిల్లాలోని పలు మండల కేంద్రాల్లో వ్యవసాయ పనిముట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిని రైతులు సద్వినియోగం చేసుకోవాలి. కేవలం కొన్ని చోట్ల మాత్రం తీసుకెళ్తున్నారు. ఇందుకోసం గ్రామాల్లో ముమ్మర ప్రచారం చేస్తున్నాం. తక్కువ అద్దెకు ఇస్తున్నాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు