logo

విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు

ప్రభుత్వ ఉద్యోగులు విధి నిర్వహణలో నిర్లక్ష్యం చేస్తే కఠినమైన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్‌ రాహుల్‌ రాజ్‌ అన్నారు.

Published : 26 Jun 2024 01:37 IST

కూరగాయలు పరిశీలిస్తున్న కలెక్టర్‌ రాహుల్‌ రాజ్‌ 

రేగోడ్, న్యూస్‌టుడే: ప్రభుత్వ ఉద్యోగులు విధి నిర్వహణలో నిర్లక్ష్యం చేస్తే కఠినమైన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్‌ రాహుల్‌ రాజ్‌ అన్నారు. రేగోడ్‌ తహసీల్‌ కార్యాలయం, కస్తూర్బా బాలికల విద్యాలయం, ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంను మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేసి ప్రజలకు అందుతున్న సేవలు, ఉద్యోగుల పనితీరు, నిర్వహణకు సంబంధించిన పలు దస్త్రాలను పరిశీలించారు. ఫిర్యాదుల పరిష్కారంలో నిర్లక్ష్యం చేసి బాధితులను ఇబ్బందులకు గురి చేస్తే సంబంధిత సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయంలో తరగతి గదులు, వంటశాల, కూరగాయలను పరిశీలించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రోగులకు అందుతున్న సేవలను పరిశీలించారు. తహసీల్దార్‌ బాలలక్ష్మి, ప్రత్యేక అధికారిణి స్వయంప్రభ తదితరులున్నారు.  

అంగన్‌వాడీలో పూర్వ ప్రాథమిక విద్య 

మెదక్‌: అంగన్‌వాడీలో పూర్వ ప్రాథమిక విద్య కేంద్రాలను వచ్చే నెలలో ప్రారంభించనున్నట్లు, అప్పటి వరకు నిర్దేశించిన పనులు పూర్తి చేయాలని కలెక్టర్‌ రాహుల్‌ రాజ్‌ ఆదేశించారు. రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి వాకాటి కరుణ.. ఆయా జిల్లాల కలెక్టర్లతో దూరదృశ్య సమీక్ష నిర్వహించారు. అనంతరం కలెక్టర్‌ జిల్లా సంక్షేమ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు.

విశ్వకర్మ పథకంపై ప్రచారం  

ప్రధానమంత్రి విశ్వకర్మ పథకాన్ని ప్రజల సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్‌ తెలియజేశారు. ఈ పథకం అమలుపై సమీక్ష సమావేశం నిర్వహించారు. స్వయం సహాయక బృందాలు, పట్టణాభివృద్ధి సంస్థ రిసోర్స్‌ పర్సన్స్‌ల ద్వారా ఈ పథకంపై విస్తృత ప్రచారం చేయాలని ఆదేశించారు. పీఎం స్వనిధి, ముద్ర, పీఎంఈజీపీ ద్వారా రుణం పొంది తిరిగి చెల్లించడంలో విఫలమైన వారు ప్రధానమంత్రి విశ్వకర్మ పథకానికి అనర్హులని తెలిపారు. సమావేశంలో ఎంఎస్‌ఎంఈ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ గుల్షన్‌ సింగ్, జిల్లా పరిశ్రమల శాఖ మేనేజర్‌ కృష్ణమూర్తి, డీఆర్డీవో శ్రీనివాస్‌ రావు, మెప్మా పీడీ ఇందిరా, జిల్లా షెడ్యూల్డ్‌ కులాల అభివృద్ధి అధికారి విజయలక్ష్మి, జిల్లా వెనకబడిన తరగతుల అధికారి నాగరాజు, లీడ్‌ బ్యాంక్‌ మేనేజర్‌ నరసింహ మూర్తి పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని