logo

నాటి చీకటి రోజులు మర్చిపోలేం

ప్రజాస్వామ్యంలో జూన్‌ 25 చీకటి రోజు అని, ఎప్పటికీ మర్చిపోలేమని నిజామాబాద్‌ అర్బన్‌ ఎమ్మెల్యే ధన్‌పాల్‌ సూర్యనారాయణ అన్నారు.

Published : 26 Jun 2024 01:28 IST

నిజామాబాద్‌ అర్బన్‌ ఎమ్మెల్యే సూర్యనారాయణ

మాట్లాడుతున్న సూర్యనారాయణ  

మెదక్‌ అర్బన్, న్యూస్‌టుడే: ప్రజాస్వామ్యంలో జూన్‌ 25 చీకటి రోజు అని, ఎప్పటికీ మర్చిపోలేమని నిజామాబాద్‌ అర్బన్‌ ఎమ్మెల్యే ధన్‌పాల్‌ సూర్యనారాయణ అన్నారు. నాటి దుస్థితిని నేటి ప్రజలకు, రాబోయే తరాలకు తెలియజేయాల్సిన అవసరం ఎంతో ఉందని పేర్కొన్నారు. మంగళవారం మెదక్‌లో భాజపా జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్‌ అధ్యక్షతన ఎమర్జెన్సీ వ్యతిరేక దినం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ.. అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ అత్యవసర పరిస్థితిని విధించారన్నారు. దీనికి వ్యతిరేకంగా పోరాడి ఎంతో మంది జైలు పాలయ్యారన్నారు. కార్యక్రమంలో పార్టీ ప్రధాన కార్యదర్శి ఎం.ఎల్‌.ఎన్‌.రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి నందారెడ్డి, అసెంబ్లీ కన్వీనర్లు మధు, రమణ, సమావేశ కోఆర్డినేటర్‌ రాములు, పట్టణాధ్యక్షుడు నాయిని ప్రసాద్, ఆయా మోర్చాల జిల్లా అధ్యక్షులు వీణ, కాశీనాథ్‌ తదితరులు పాల్గొన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు