logo

Mahbubnagar: నాణ్యమైన భోజనం అందించాలి

పాఠశాలలో విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు, మెనూ ప్రకారం భోజనం అందించాలని జడ్పీ ఛైర్‌పర్సన్‌ సరిత అన్నారు.

Updated : 02 Jul 2024 16:39 IST

రాజోలి: పాఠశాలలో విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు, మెనూ ప్రకారం భోజనం అందించాలని జడ్పీ ఛైర్‌పర్సన్‌ సరిత అన్నారు. మంగళవారం గద్వాల మండలం గోనుపాడు గ్రామంలో ఉన్న కస్తూర్బా గాంధీ పాఠశాలను ఆమె తనిఖీ చేసారు. విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వర్షాకాలంలో సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. అనంతరం ఎన్.సి.సి విద్యార్ధులతో కలసి పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మధుసూదన్ బాబు, శ్రీనివాస్ గౌడ్, కృష్ణారెడ్డి, లక్ష్మణ్, నాగేంద్ర యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని