logo

ఐటీఐల్లో ప్రవేశానికి రెండో విడత నోటిఫికేషన్‌

ఐటీఐ కోర్సుల్లో రెండో విడత ప్రవేశానికి ఉపాధి శిక్షణ శాఖ నోటిఫికేషన్‌ జారీ చేసినట్లు మహబూబ్‌నగర్‌ జిల్లా కన్వీనర్, మెట్టుగడ్డ ప్రభుత్వ ఐటీఐ కళాశాల ప్రిన్సిపల్‌ బి.శాంతయ్య తెలిపారు.

Published : 05 Jul 2024 04:09 IST

మహబూబ్‌నగర్‌ అర్బన్, న్యూస్‌టుడే : ఐటీఐ కోర్సుల్లో రెండో విడత ప్రవేశానికి ఉపాధి శిక్షణ శాఖ నోటిఫికేషన్‌ జారీ చేసినట్లు మహబూబ్‌నగర్‌ జిల్లా కన్వీనర్, మెట్టుగడ్డ ప్రభుత్వ ఐటీఐ కళాశాల ప్రిన్సిపల్‌ బి.శాంతయ్య తెలిపారు. అర్హులైన అభ్యర్థులు ఈ నెల 15వ తేదీ లోపు ప్రభుత్వ వెబ్‌సైట్‌ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడంతో పాటు వెబ్‌ఆప్షన్‌ ఇచ్చుకోవాలన్నారు. 1 ఆగస్టు 2024 నాటికి 14 సంవత్సరాలు పైబడిన వారు మాత్రమే ఈ కోర్సులు అభ్యసించేందుకు అర్హులన్నారు. 10వ తరగతి ఉత్తీర్ణత సాధించిన వారికి ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, మెకానిక్‌ డీజిల్, టర్నర్, మిషనిస్టు, కోపా తదితర కోర్సులతో పాటు 8వ తరగతి పాసైన వారికి కార్పెంట్, వెల్డర్, సీవింగ్‌ టెక్నాలజీ, డ్రస్‌ మేకింగ్‌ తదితర కోర్సులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. మొదటి విడతలో దరఖాస్తు చేసుకున్నా సీటు రాని వారు  మరోసారి దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని, కొత్తగా వెబ్‌ ఆప్షన్‌  మాత్రమే ఇచ్చుకోవాల్సి ఉంటుందన్నారు. సీట్ల కేటాయింపు మెరిట్, రిజర్వేషన్, అభ్యర్థి ఎంచుకున్న కోర్సు, ఐటీఐని బట్టి నిర్ణయించడతాయని పేర్కొన్నారు. ఎంపికైన అభ్యర్థుల చరవాణికి సంక్షిప్త సమాచారం (ఎస్‌ఎంఎస్‌) అందుతుందన్నారు. అందులో పొందుపర్చిన విధంగా నిర్దేశిత ఐటీఐలో చేరాల్సి ఉంటుందని తెలిపారు.http://iti.telangana.gov.in వెబ్‌సైట్‌ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని