logo

టిప్పర్‌ కింద పడి యువకుడి మృతి

టిప్పర్‌ కింద పడి నర్సిరెడ్డి(30) అనే యువకుడు మృతి చెందిన సంఘటన నారాయణపేటలో చోటుచేసుకుంది. పద్మమ్మ, అనంత్‌రెడ్డిలకు ముగ్గురు ఆడపిల్లలు. వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నారు.

Published : 05 Jul 2024 03:58 IST

 నర్సిరెడ్డి

నారాయణపేట(పాతబస్టాండ్‌), న్యూస్‌టుడే : టిప్పర్‌ కింద పడి నర్సిరెడ్డి(30) అనే యువకుడు మృతి చెందిన సంఘటన నారాయణపేటలో చోటుచేసుకుంది. పద్మమ్మ, అనంత్‌రెడ్డిలకు ముగ్గురు ఆడపిల్లలు. వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. రెండోకుమార్తె భీమమ్మ నారాయణపేట మున్సిపాలిటీలో అటెండర్‌గా ఉద్యోగం చేస్తోంది. ఆమె భర్త నర్సిరెడ్డి ప్రతిరోజూ అంధురాలైన భీమమ్మను మక్తల్‌కు తీసుకువెళ్లేవాడు. పేటలోని హాజిఖాన్‌పేటలో మూడేళ్ల కిందట ఇల్లు అద్దెకు తీసుకుని జీవిస్తున్నారు. గురువారం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో వ్యక్తిగత పనిపై పాతబస్టాండ్‌  చౌరస్తాకు వస్తున్న సమయంలో మొరం లోడ్‌తో  వస్తున్న టిప్పర్‌ కింద పడి నర్సిరెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు. అంధురాలైన భీమమ్మ బోరున విలపించడం అందరినీ కంటతడి పెట్టించింది. ఈ దంపతులకు రెండేళ్ల  ఆడపిల్ల ఉంది. కుటుంబీకులు వచ్చాక కేసు నమోదు చేస్తామని ఎస్‌ఐ వెంకటేశ్వర్లు తెలిపారు.

భర్త మరణవార్త తెలిసి బోరున విలపిస్తున్న అంధురాలైన భీమమ్మ

గతంలోనూ... ఉమ్మడి జిల్లాలో టిప్పర్‌ కిందపడి ఎంతోమంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నా అధికారులు మాత్రం యజమానులపై  ఏ మాత్రం చర్యలు తీసుకోవడంలేదు. మూడేళ్ల కిందట నారాయణపేట మండలం భైరంకొండలో సాయినాథ్‌ అనే యువకుడు టిప్పర్‌ కిందపడి మృతి చెందాడు. అప్పట్లో టిప్పర్‌ యజమాని బెదిరింపులపై పేట పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. అధికారులు, గ్రామపెద్దల సమక్షంలో రాజీ జరిగింది. అదే టిప్పర్‌ గురువారం మరోమారు నిండు ప్రాణాన్ని బలితీసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని