logo

చిరుత సంచారంతో కలకలం !

నాగర్‌కర్నూల్‌ జిల్లా పెంట్లవెల్లి మండలం ఎంగంపల్లి తండా సమీపంలోని పొలాల్లో చిరుత సంచారంపై భయాందోళన నెలకొంది.

Published : 04 Jul 2024 04:14 IST

గుర్తించిన పాద ముద్ర

పెంట్లవెల్లి, న్యూస్‌టుడే : నాగర్‌కర్నూల్‌ జిల్లా పెంట్లవెల్లి మండలం ఎంగంపల్లి తండా సమీపంలోని పొలాల్లో చిరుత సంచారంపై భయాందోళన నెలకొంది. పొలాలకు కాపలా ఉన్న రైతులు బుధవారం తెల్లవారుజామున అలికిడి వినిపించడంతో టార్చిలైట్‌ వెలుతురులో చిరుతగా గుర్తించారు. అప్రమత్తమైన అరుపులు, కేకలు వేయడంతో చిరుత దూరంగా వెళ్లిపోయిందని ప్రత్యక్షంగా చూసిన రైతు సోదరులు గుడమోని కురుమయ్య, గుడమోని గోవింద్‌ పేర్కొన్నారు. అటవీశాఖ అధికారులు జంతువు పాదముద్రలు పరిశీలించారు.  అటవీశాఖ రేంజి అధికారి శరత్‌చంద్ర రెడ్డి మాత్రం ధ్రువీకరించడం లేదు. ఏప్రిల్‌ 23న ఓ రైతు ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలో చిరుత లాంటి జంతువు దృశ్యాలు నమోదయ్యాయని, ఇప్పుడు కనిపించింది కూడా కచ్చితంగా చిరుత అని రైతులు పేర్కొంటున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని