logo

పచ్చని కొండ.. మధురానుభూతి నిండా!

పేదల తిరుపతిగా విరాజిల్లుతున్న మన్యంకొండ పుణ్యక్షేత్రం పచ్చని అందాలతో కనువిందు చేస్తోంది. ఇటీవల కురిసిన వానలకు కొండపై పచ్చదనం పరచుకుంది.

Updated : 04 Jul 2024 06:12 IST

పచ్చని మన్యంకొండపై స్వామివారి కోవెల

పేదల తిరుపతిగా విరాజిల్లుతున్న మన్యంకొండ పుణ్యక్షేత్రం పచ్చని అందాలతో కనువిందు చేస్తోంది. ఇటీవల కురిసిన వానలకు కొండపై పచ్చదనం పరచుకుంది. ఎటు చూసినా పచ్చని చెట్లు ఆహ్లాదం పంచుతున్నాయి. పక్షులు ఆనందంతో చేస్తున్న కిలాకిలా రావాలు వినిపిస్తున్నాయి. ఘాట్‌రోడ్డులో ప్రయాణం భక్తులకు మధురానుభూతిని ఇస్తోంది.

 కనువిందు చేస్తున్న కోనేరు

మెట్ల మార్గం, ప్రకృతి నడుమ ఉన్న కోనేరు చూపరులను ఆకట్టుకుంటున్నాయి. భక్తులు స్వామివారిని దర్శించుకుని ప్రకృతిలో సేదతీరి మధురానుభూతితో తిరిగి వెళ్తున్నారు. 

ఈనాడు, మహబూబ్‌నగర్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని