logo

ఏడు తరగతులు.. ఒకే టీచర్‌

వనపర్తి జిల్లా కొత్తకోట మండలం రామకృష్ణాపురం ప్రాథమికోన్నత పాఠశాలలో 1 నుంచి 7 తరగతి వరకు 100 మంది విద్యార్థులు అభ్యసిస్తున్నారు.

Updated : 04 Jul 2024 12:54 IST

విద్యార్థులకు బోధిస్తున్న ఉపాధ్యాయిని రజిత

వనపర్తి జిల్లా కొత్తకోట మండలం రామకృష్ణాపురం ప్రాథమికోన్నత పాఠశాలలో 1 నుంచి 7 తరగతి వరకు 100 మంది విద్యార్థులు అభ్యసిస్తున్నారు. గతంలో ఇక్కడ ఆరుగురు ఉపాధ్యాయులు ఉండేవారు. ఆరేళ్ల క్రితం సాంఘికశాస్త్రం బోధించే ఉపాధ్యాయుడు పదవీవిరమణ చేశారు. హిందీ ఉపాధ్యాయుడు రెండేళ్లుగా కొత్తకోటలో డిప్యూటేషన్‌పై విధులు నిర్వహిస్తున్నారు. మిగిలిన నలుగురిలో ఇటీవల జరిగిన బదిలీల్లో ముగ్గురు ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయారు. ప్రస్తుతం రజిత అనే ఉపాధ్యాయిని విధులు నిర్వహిస్తున్నారు. ఇక్కడికి వీపనగండ్ల మండలం నుంచి ఒక ఉపాధ్యాయుడు బదిలీపై రావాల్సి ఉండగా.. రిలీవర్‌ రాకపోవడంతో ఆయన అక్కడే ఉన్నారు. డిప్యూటేషన్‌పై విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయుడు బదిలీ అయ్యారు. ప్రస్తుతం పాఠశాలలో 100 మంది విద్యార్థులను ఉపాధ్యాయిని బోధిస్తున్నారు.

 న్యూస్‌టుడే, కొత్తకోట గ్రామీణం


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని