logo

ఉపాధ్యాయుడిపై రౌడీషీటర్‌ దాడి

పట్టణంలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో ఓ ఉపాధ్యాయుడిపై బుధవారం మధ్యాహ్నం రౌడీషీటర్‌ దాడి చేశాడు.

Published : 04 Jul 2024 04:02 IST

అమరచింత, న్యూస్‌టుడే : పట్టణంలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో ఓ ఉపాధ్యాయుడిపై బుధవారం మధ్యాహ్నం రౌడీషీటర్‌ దాడి చేశాడు. బాధిత ఉపాధ్యాయుడు, ఉపాధ్యాయులు, మండల విద్యాధికారి భాస్కర్‌ సింగ్‌ కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. పాఠశాలలో ఆంగ్ల మాధ్యమంలో ఏడో తరగతి చదువుతున్న ఓ విద్యార్థి గణితం హోం వర్క్‌ చేయలేదని సోమవారం ఉపాధ్యాయుడు కొట్టారు. ఆ విదార్థి తండ్రి పాఠశాలకు వచ్చి ఈ విషయంపై మాట్లాడటంతో మరోసారి ఇలా జరగకుండా చూసుకుంటామని నచ్చజెప్పి పంపించారు. బుధవారం విద్యార్థి తండ్రితో పాటు ఓ రౌడీషీటర్‌ పాఠశాలకు వచ్చారు. మధ్యాహ్నం భోజనం చేస్తున్న ఉపాధ్యాయుడిపై రౌడీషీటర్‌ దాడి చేసి బ్లేడ్‌తో బెదిరించి వెళ్లారు. దాడి సంఘటనపై పోలీస్‌ స్టేషన్‌లో కేసు పెట్టాలా? వద్దా? నిబంధనల ప్రకారం విద్యార్థికి కొట్టడం తప్పని, తిరిగి తమపై కేసు పెడితే ఎలా? అని ఉపాధ్యాయులు చర్చించుకున్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఠాణాలో ఫిర్యాదు చేయాలని మండల విద్యాధికారి భాస్కర్‌సింగ్, సీఆర్పీ స్వామి వెంట ఉపాధ్యాయులు వెళ్లారు. దాడి జరిగిన విషయంపై ప్రధానోపాధ్యాయిని కృష్ణవేణమ్మ మాట్లాడుతూ పాఠశాలకు చెడ్డపేరు వస్తుందని, ఇలా జరిగితే పాఠశాలలో ఉపాధ్యాయులు ఎలా పనిచేస్తారని, విద్యార్థులకు నష్టం కలుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై ఎస్సై బి.సురేశ్‌ను వివరణ కోరగా దాడి సంఘటనపై ఫిర్యాదు చేశారని, కేసు వద్దని చెప్పారని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని