logo

నేడు నల్లమలకు మంత్రి సీతక్క రాక

పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ధనసరి అనసూయ(సీతక్క) మంగళవారం నల్లమలలో పర్యటించనున్నారు.

Published : 02 Jul 2024 02:52 IST

అమ్రాబాద్‌ మండలం తెలుగుపల్లిలో మంత్రి ప్రారంభించనున్న కేజీబీవీ

అమ్రాబాద్, న్యూస్‌టుడే: పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ధనసరి అనసూయ(సీతక్క) మంగళవారం నల్లమలలో పర్యటించనున్నారు. మండలంలోని తెలుగుపల్లిలో ఉదయం రూ.3.5 కోట్లతో నిర్మించిన కేజీబీవీని ప్రారంభించి తర్వాత గ్రామ పంచాయతీ భవనానికి శంకుస్థాపన చేసి ఆవరణలో మొక్కలు నాటి వన మహోత్సవాన్ని ప్రారంభిస్తారు. తర్వాత ఎల్మపల్లిలో ఎస్సీ సామాజిక భవనానికి,  అమ్రాబాద్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రహరీ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. మ.12 గంటలకు పదర మండలం రాయలగండి శ్రీలక్ష్మీచెన్నకేశవస్వామి ఆలయంలో అభివృద్ధి పనులను ప్రారంభించి అనంతరం అచ్చంపేట మండలం బయలుదేరుతారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే వంశీకృష్ణ పాల్గొంటారని ఎంపీడీవో మోహన్‌లాల్‌ తెలిపారు.

ఉప్పునుంతల, న్యూస్‌టుడే: మండలంలో రహదారుల శంకుస్థాపన, ప్రారంభోత్సవాలకు మంత్రి సీతక్క మంగళవారం రానున్నారని.. మంత్రి పర్యటనను విజయవంతం చేయాలని జడ్పీటీసీ ప్రతాప్‌రెడ్డి, నాయకులు కట్టా అనంతరెడ్డి, తిప్పర్తి నర్సింహారెడ్డి ఓ ప్రకటనలో కోరారు. జిన్‌కుంట-మామిళ్లపల్లి రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన, మామిళ్లపలి-ఉప్పరిపల్లి రహదారి ప్రారంభోత్సవం చేయనున్నారని చెప్పారు.

అచ్చంపేట, న్యూస్‌టుడే : రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క మంగళవారం అచ్చంపేట నియోజకవర్గంలో పర్యటించనున్నారు. వివిధ అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేయనున్నారని ఎమ్మెల్యే డా.వంశీకృష్ణ తెలిపారు. నియోజకవర్గంలోని అమ్రాబాద్, పదర, ఉప్పునుంతల, అచ్చంపేట మండలాల్లో పర్యటిస్తారన్నారు. మధ్యాహ్నం 3 గంటలకు అచ్చంపేటలో నిర్వహించే మహిళా సంఘాల సమావేశంలో పాల్గొని చెక్కులు పంపిణీ చేయనున్నారని పేర్కొన్నారు. మంత్రి పర్యటనను విజయవంతం చేసేందుకు కాంగ్రెస్‌ శ్రేణులు శ్రద్ధ తీసుకోవాలన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని