logo

గుండెపోటుకు గురై విధి నిర్వహణలో ఏఎన్‌ఎం మృతి

జాతీయ వైద్యుల దినోత్సవం రోజే నవాబ్‌పేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో విషాదం చోటు చేసుకుంది.

Published : 02 Jul 2024 02:50 IST

కృష్ణవేణి

నవాబ్‌పేట, న్యూస్‌టుడే : జాతీయ వైద్యుల దినోత్సవం రోజే నవాబ్‌పేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో విషాదం చోటు చేసుకుంది. సోమవారం ఉదయం పీహెచ్‌సీలో రెండో ఏఎన్‌ఎం కృష్ణవేణి(34) రోగులకు వైద్యసేవలు అందిస్తూనే గుండెపోటుకు గురై పడిపోయారు. అక్కడే ఉన్న డా.నరేశ్‌ చంద్ర సీపీఆర్‌ నిర్వహించి హుటాహుటిన 108లో మహబూబ్‌నగర్‌లోని ఎస్వీఎస్‌కు తరలించారు. అక్కడి వైద్యులు పరిశీలించి అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. ఏఎన్‌ఎం మృతితో వైద్యసిబ్బంది దిగ్భ్రాంతికి గురయ్యారు. కృష్ణవేణికి భర్త, కుమారుడు ఉన్నారు. కృష్ణవేణి రెండేళ్లుగా నవాబ్‌పేట పీహెచ్‌సీలో విధులు నిర్వహిస్తున్నట్లు డా.నరేశ్‌ చంద్ర తెలిపారు. ప్రభుత్వం ఆమె కుటుంబాన్ని ఆదుకోవాలని వైద్యసిబ్బంది కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని