logo

పిల్లలమర్రి పిలుస్తోంది!

ఏడు శతాబ్దాల చరిత్ర కలిగి, మూడున్నర ఎకరాల్లో విస్తరించి ఉమ్మడి పాలమూరు జిల్లాకు తలమానికంగా నిలిచే పిల్లల మర్రికి పునర్వైభవం రానుంది. త్వరలోనే పిల్లలమర్రి సందర్శకుల కోసం గేట్లు తెరచుకోనున్నాయి.

Updated : 01 Jul 2024 06:24 IST

చెట్టుకు రక్షణగా ఏర్పాటు చేసిన ఫెన్సింగ్‌ 

డు శతాబ్దాల చరిత్ర కలిగి, మూడున్నర ఎకరాల్లో విస్తరించి ఉమ్మడి పాలమూరు జిల్లాకు తలమానికంగా నిలిచే పిల్లల మర్రికి పునర్వైభవం రానుంది. త్వరలోనే పిల్లలమర్రి సందర్శకుల కోసం గేట్లు తెరచుకోనున్నాయి. ఇందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. పర్యాటక శాఖ అధీనంలో ఉన్న సమయంలో పిల్లలమర్రిలోని ఓ భాగం తెగులు సోకి నేలకొరిగింది. అప్పటి కలెక్టర్‌ రొనాల్‌్్డ రోస్‌ తీవ్రంగా పరిగణించి పిల్లలమర్రి వద్దకు పర్యాటకులు వెళ్లకుండా చర్యలు చేపట్టారు. వృక్షాన్ని సంరక్షించే బాధ్యతలు అటవీశాఖకు అప్పగించారు. అప్పటి నుంచి ప్రత్యేక సస్యరక్షణ చర్యలు చేపట్టారు. ఇప్పటికీ ఓ స్వచ్ఛంద సంస్థ సహకారంతో దాన్ని పర్యవేక్షిస్తున్నారు. చెట్టు కూడా బాగైంది. పర్యాటకుల కోరిక మేరకు త్వరలోనే పిల్లలమర్రి వద్దకు వెళ్లేందుకు గేట్లు తెరచుకోనున్నాయి. చెట్టును తాకకుండా కేవలం చూస్తూ వెళ్లిపోయేలా ఫెన్సింగ్‌ ఏర్పాటుచేశారు. ప్రవేశద్వారం వద్ద చెట్టు చరిత్ర, సంరక్షణ బాధ్యతలకు సంబంధించిన ఫ్లెక్సీలు ఏర్పాటుచేశారు. తాగునీటి కోసం ఆర్వో ప్లాంటును సిద్ధం చేశారు. పర్యాటకులు సేదతీరేలా బెంచీలు ఏర్పాటుచేశారు. బొమ్మలతో పరిసరాలను అందంగా తీర్చిదిద్దారు. పిల్లల పార్కును సిద్ధం చేస్తున్నారు. 

ఈనాడు, మహబూబ్‌నగర్‌

ఆకట్టుకునేలా రంగుల బొమ్మలు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని