logo

నియోజకవర్గ అభివృద్ధికి కృషి

అలంపూర్ నియోజకవర్గ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తున్నానని ఎమ్మెల్యే విజయుడు అన్నారు.

Published : 03 Jul 2024 14:12 IST

రాజోలి : అలంపూర్ నియోజకవర్గ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తున్నానని ఎమ్మెల్యే విజయుడు అన్నారు. బుధవారం జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మండలం కొంకల గ్రామంలో  ప్రభుత్వ నిధులతో నిర్మించిన బీసీ కమ్యూనిటీ హల్ (ముదిరాజ్ భవనము)ను ప్రారంభించారు. అనంతరం  వడ్డెర కమ్యూనిటీ హల్ భవనానికి శంకుస్థాపన చేశారు.  ఈ సందర్భంగా ముదిరాజ్ సంఘం పెద్దలు , వడ్డెర సోదరులు ఎమ్మెల్యే విజేయుడు, ఎంపీపీ రజిత, వైస్ ఎంపీపీ చంద్రశేఖర్ గౌడ్, మాజీ జెడ్పిటిసి వడ్డేపల్లి శ్రీనివాసులు ను  పూల మాల,  శాలువతో సన్మానం  చేశారు. మత్యశాఖ జిల్లా అధ్యక్షులు టి గోపాల్, పుల్లూరు నాగేశ్వర రెడ్డి   తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని