logo

Mahbubnagar: ఇంటర్ పాఠ్యపుస్తకాలొచ్చాయ్.!

రాష్ట్ర ప్రభుత్వం జూనియర్ కళాశాలల్లో చదువుతున్న వారికి ఉచితంగా పాఠ్యపుస్తకాలు అందిస్తోంది.

Published : 19 Jun 2024 19:55 IST

రాజోలి: రాష్ట్ర ప్రభుత్వం జూనియర్ కళాశాలల్లో చదువుతున్న వారికి ఉచితంగా పాఠ్యపుస్తకాలు అందిస్తోంది. అయితే.. ఇంటర్ పాఠాలు జూన్ 1వ తేదీ నుంచి ప్రారంభం కాగా, పుస్తకాలు లేక విద్యార్థుల చదువులు ముందుకు సాగడం లేదు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఎట్టకేలకు పుస్తకాలను సరఫరా చేసింది. జోగులాంబ గద్వాల జిల్లాలో మొత్తం 8 ప్రభుత్వ జూనియర్ కళాశాలలున్నాయి. వీటిలో 2,250 మందికి పైగా విద్యార్థులు ఎంపీసీ, బైపీసీ, హెచ్‌ఈసీ, సీఈసీ, వృత్తివిద్య కోర్సుల్లో చదువుతున్నారు. వీరికి పంపిణీ చేసేందుకు 15,330 పాఠ్యపుస్తకాలను ప్రభుత్వం సరఫరా చేసినట్లు ఇంటర్ నోడల్ అధికారి తెలిపారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని