logo

Telugu news: చేనేత పురస్కారాలకు దరఖాస్తుల ఆహ్వానం

రాష్ట్ర ప్రభుత్వం చేనేత కార్మికుల కోసం అందించనున్న రాష్ట్రస్థాయి కొండా లక్ష్మణ్ బాపూజీ పురస్కారాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లుగా జిల్లా చేనేత జౌళి శాఖ సహాయ సంచాలకులు గోవిందయ్య తెలిపారు.

Published : 27 Jun 2024 16:16 IST

రాజోలి: రాష్ట్ర ప్రభుత్వం చేనేత కార్మికుల కోసం అందించనున్న రాష్ట్రస్థాయి కొండా లక్ష్మణ్ బాపూజీ పురస్కారాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లుగా జిల్లా చేనేత జౌళి శాఖ సహాయ సంచాలకులు గోవిందయ్య తెలిపారు. గద్వాల, నారాయణపేట, పోచంపల్లి తదితర రకాల చేనేత చీరలకు సంబంధించి నేత పనిలో నైపుణ్యం చాటిన కార్మికులు, చీర డిజైనింగ్ లో ప్రత్యేక ప్రతిభ చాటుతున్న కళాకారులు దరఖాస్తు చేసుకోవచ్చని ఆయన పేర్కొన్నారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా అందించే ఈ పురస్కారాలకు ఎంపికైన వారికి మెమొంటోతో పాటు రూ.25 వేల నగదు అందించడం జరుగుతుందని ఆయన అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు