logo

Mahbubnagar: బాల కార్మికుల నిర్మూళన అందరి బాధ్యత

బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించడం అందరి బాధ్యతని, ఇందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎంవీ ఫౌండేషన్ మండల సమన్వయకర్త హన్మిరెడ్డి అన్నారు.

Updated : 12 Jun 2024 18:12 IST

రాజోలి: బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించడం అందరి బాధ్యతని, ఇందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎంవీ ఫౌండేషన్ మండల సమన్వయకర్త హన్మిరెడ్డి అన్నారు. బాల కార్మిక వ్యతిరేఖ దినోత్సవం సందర్భంగా బుధవారం మండలంలోని ముండ్లదిన్నె గ్రామంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. పాఠశాల నుంచి ప్రధాన వీధుల్లో నినాదాలు చేస్తూ ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. బడిఈడు పిల్లలను పాఠశాలకు పంపించకుండా, పనికి పంపడం వల్ల వారి భవిష్యత్తు అంధకారం అవుతుందని తల్లిదండ్రులకు సూచించారు. ప్రజాప్రతినిధులు, యువత, మహిళలు భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మాజీ సర్పంచిలు మహేశ్వర్‌రెడ్డి, రాఘవరెడ్డి, హెచ్ఎం నస్రీన్, కార్యదర్శి జ్ఞానేశ్వరి తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు