logo

Mahbubnagar: పింఛన్ కోసం రోడ్డెక్కిన వృద్ధులు, దివ్యాంగులు

ప్రతి నెల మొదటి వారంలో అందాల్సిన పింఛను సక్రమంగా అందడం లేదంటూ ఐజ పట్టణంలో వృద్ధులు, దివ్యాంగులు రోడ్డెక్కి ఆందోళన చేపట్టారు.

Published : 25 Jun 2024 15:44 IST

రాజోలి: ప్రతి నెల మొదటి వారంలో అందాల్సిన పింఛను సక్రమంగా అందడం లేదంటూ ఐజ పట్టణంలో వృద్ధులు, దివ్యాంగులు రోడ్డెక్కి ఆందోళన చేపట్టారు. పట్టణంలోని పాత బస్టాండ్ సెంటర్‌లో నిరసన తెలిపారు. 5వ తేదీలోగా ఇవ్వాల్సిన పింఛన్ ఇంతవరకు ఇవ్వకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని ఈ సందర్భంగా పింఛనుదారులు వాపోయారు. వారికి జిల్లా భాజపా అధ్యక్షుడు రామచంద్రారెడ్డి మద్దతు తెలిపారు. ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడుతుందని ఆయన విమర్శించారు. పింఛను రూ.4,000 పెంచుతామని ఎన్నికల్లో హామీ ఇచ్చిన సీఎం పట్టించుకోవడంలేదని అన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని