logo

Mahbubnagar: డ్రైడే పాటిస్తే వ్యాధులు దూరం

ప్రజలు ప్రతి శుక్రవారం నిల్వ ఉన్న నీటిని పారబోసి, డ్రై డే ను పాటిస్తే వ్యాధులకు దూరంగా ఉండొచ్చని మండల వైద్యాధికారి డా.మధుబాబు అన్నారు.

Published : 07 Jun 2024 20:11 IST

రాజోలి: ప్రజలు ప్రతి శుక్రవారం నిల్వ ఉన్న నీటిని పారబోసి, డ్రై డే ను పాటిస్తే వ్యాధులకు దూరంగా ఉండొచ్చని మండల వైద్యాధికారి డా.మధుబాబు అన్నారు. ఆయన ఆధ్వర్యంలో మండలంలోని తుమ్మిళ్ల గ్రామంలో వైద్య సిబ్బంది ఇంటింటికీ వెళ్లి నిల్వ ఉన్న నీటిని పారబోశారు. ఇంటి ఆవరణంలో నీరు నిల్వ ఉండటం వల్ల లార్వాలు పెరిగి, దోమలు ప్రభలుతాయన్నారు. దీని వల్ల వివిధ రకాల వ్యాధులు వస్తాయన్నారు. అలాగే దోమలు కుట్టుకుండా దోమతెరలు వాడాలని ప్రజలకు సూచించారు. కార్యక్రమంలో హెల్త్ అసిస్టెంట్లు జయప్రకాశ్, రంజిత్, ఏఎన్ఎమ్, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని