logo

ఆసుపత్రిలో సమస్యలు పరిష్కరించాలని నిరసన

ప్రజల కోసం నిర్మించిన ప్రభుత్వ ఆసుపత్రిలో సమస్యలు పరిష్కరించాలని గురువారం నిరసన కార్యక్రమం చేపట్టారు.

Published : 27 Jun 2024 12:55 IST

రాజోలి: ప్రజల కోసం నిర్మించిన ప్రభుత్వ ఆసుపత్రిలో సమస్యలు పరిష్కరించాలని గురువారం నిరసన కార్యక్రమం చేపట్టారు. ఐయిజ పట్టణంలో 30 పడకల ప్రభుత్వాసుపత్రిని  భాజపా జిల్లా అధ్యక్షులు ఎస్‌. రామచంద్రారెడ్డి, నాయకులతో కలిసి పరిశీలించారు. అనంతరం  సమస్యలు పరిష్కరించాలని నినాదాలు చేశారు.  ఈ ఆసుపత్రిలో ఏడాది  నుంచి ఎలాంటి పనులు పూర్తి చేయడం లేదన్నారు.  నిత్యం 250 కి పైగా రోగులు  ఆసుపత్రికి వస్తుంటారని,  అక్కడ సరిపడా మందులు అందుబాటులో లేవని విమర్శించారు.  ప్రభుత్వం స్పందించి వెంటనే సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఆయన వెంట పట్టణ , మండల అధ్యక్షులు నరసింహ శెట్టి, గోపాలకృష్ణ , ప్రధాన కార్యదర్శులు ప్రదీప్ స్వామి, భగత్ రెడ్డి, జిల్లా ఓబీసీ ఉపాధ్యక్షులు వెంకటేష్ యాదవ్, వీరయ్య ఆచారి తదితరులున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని