logo

Mahabubnagar: రేపు విద్యాసంస్థలు బంద్‌కు పిలుపు

నీట్ పేపర్ లీకేజీ వ్యవహారాన్ని నిరసిస్తూ ఈనెల జులై 4న దేశవ్యాప్తంగా జరిగే కేజీ టు పీజీ వరకు విద్యాసంస్థల బంద్‌ను విజయవంతం చేయాలని పీడీఎస్‌యూ, ఎన్‌ఎస్‌యూఐ, ఎస్‌ఎఫ్ఐ, ఏఐఎస్‌ఎఫ్‌ జిల్లా నాయకులు పిలుపునిచ్చారు.

Published : 03 Jul 2024 18:54 IST

రాజోలి: నీట్ పేపర్ లీకేజీ వ్యవహారాన్ని నిరసిస్తూ ఈనెల జులై 4న దేశవ్యాప్తంగా జరిగే కేజీ టు పీజీ వరకు విద్యాసంస్థల బంద్‌ను విజయవంతం చేయాలని పీడీఎస్‌యూ, ఎన్‌ఎస్‌యూఐ, ఎస్‌ఎఫ్ఐ, ఏఐఎస్‌ఎఫ్‌ జిల్లా నాయకులు పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రూ. లక్షలకు నీట్ పరీక్ష పత్రాలు లీకేజి చేసి 24 లక్షల మంది జీవితాలతో ఎన్‌టీఏ చెలగాటం ఆడిందన్నారు.  దేశవ్యాప్త ఆందోళనలు జరిగిన దేశ ప్రధాని ఇప్పటి వరకు స్పందించలేదని ఆరోపించారు. పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ నీట్‌ ఛైర్మన్‌ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఎన్‌ఎస్‌యూఐ జిల్లా అధ్యక్షులు వెంకటేష్, పీడీఎస్‌యూ జిల్లా అధ్యక్షులు హాలింపాషా, యూఎస్‌ఎఫ్‌ఐ రంగస్వామి హరీష్, ఏఐఎస్‌ఎఫ్‌ ప్రవీణ్, ఎస్‌ఎఫ్‌ఐ  నవీద్ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని