logo

Mahbubnagar: బస్సులు లేక విద్యార్ధుల అవస్థలు

మండలంలోని మాన్ దొడ్డి గ్రామానికి ఆర్టీసీ బస్సు రాకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

Published : 14 Jun 2024 20:55 IST

రాజోలి: మండలంలోని మాన్ దొడ్డి గ్రామానికి ఆర్టీసీ బస్సు రాకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. శుక్రవారం పాఠశాలకి వచ్చిన పచ్చర్ల గ్రామ విద్యార్థులు ఆటోల కోసం గంటల తరబడి వేచి ఉన్నారు. అటుగా వెళ్లే ద్విచక్ర వాహనదారులను లిఫ్ట్ అడుతూ కనిపిస్తున్నారు. పచ్చర్ల గ్రామం నుంచి దాదాపు 50 మందికి పైగా విద్యార్థులు పాఠశాలకు వస్తుంటారు. అయితే నాలుగు నెలలుగా బస్సు రాకపోవడంతో గత విద్యా సంవత్సరం తీవ్ర ఇక్కట్లు పడ్డారు. ప్రస్తుతం పాఠశాలలు ప్రారంభమైనా బస్సు రావడం లేదు. దీని కారణంగా ఆ గ్రామం నుంచి వచ్చే విద్యార్థుల సంఖ్య చాలా తక్కువగా ఉంటోందని ఉపాధ్యాయులు చెబుతున్నారు. తమకు బస్సు సౌకర్యం కల్పించాలని విద్యార్థులు కోరుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు