logo

Mahbubnagar: వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి

వర్షాకాలం నేపథ్యంలో వ్యాధులు ప్రభలకుండా అప్రమత్తంగా ఉండాలని మండల వైద్యాధికారి డా. మధుబాబు అన్నారు.

Published : 02 Jul 2024 16:57 IST

రాజోలి: వర్షాకాలం నేపథ్యంలో వ్యాధులు ప్రభలకుండా అప్రమత్తంగా ఉండాలని మండల వైద్యాధికారి డా. మధుబాబు అన్నారు. మంగళవారం మండలంలోని అన్ని గ్రామాల ఏఎన్ఎమ్, ఆశా కార్యకర్తలకు అవగాహన కల్పించారు. దోమలు ప్రభలకుండా ఇళ్లల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ప్రజలకు వివరించాలన్నారు. ముఖ్యంగా డయేరియా, డెంగీ, మలేరియా వ్యాధులతో పాటు టీబీ వ్యాధులు రాకుండా ఏమి చెయ్యాలో అవగాహన కల్పించాలన్నారు. వ్యాధుల లక్షణాలు కనిపిస్తే చికిత్స అందించాలని, అవసరమైతే ఆసుపత్రికి సిఫార్సు చేయాలని సూచించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని