logo

Mahbubnagar: ప్రభుత్వ పాఠశాలల్లోనే అన్ని రకాల సౌకర్యాలు

ప్రభుత్వ పాఠశాలలో అన్ని రకాల సౌకర్యాలున్నాయని, ఉచితంగా పుస్తకాలు, మధ్యాహ్న భోజనం, నిపుణులైన ఉపాధ్యాయులతో నాణ్యమైన బోధన అందుతోందని ఎంవీఎఫ్ మండల సమన్వయకర్త హన్మిరెడ్డి, హెచ్ఎమ్ చంద్రశేఖర్ అన్నారు.

Published : 19 Jun 2024 17:20 IST

రాజోలి: ప్రభుత్వ పాఠశాలలో అన్ని రకాల సౌకర్యాలున్నాయని, ఉచితంగా పుస్తకాలు, మధ్యాహ్న భోజనం, నిపుణులైన ఉపాధ్యాయులతో నాణ్యమైన బోధన అందుతోందని ఎంవీఎఫ్ మండల సమన్వయకర్త హన్మిరెడ్డి, హెచ్ఎమ్ చంద్రశేఖర్ అన్నారు. బడిబాట ముగింపు కార్యక్రమం సందర్భంగా బుధవారం మండలంలోని పచ్చర్ల గ్రామంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ప్రధాన కూడలివద్ద మానవహారం ఏర్పాటు చేసి నినాదాలు చేశారు. బడిఈడు పిల్లలను పనికి పంపరాదని, పాఠశాలకు పంపించాలని ఈ సందర్భంగా తల్లిదండ్రులకు సూచించారు. కార్యక్రమంలో ఏఏపీసీ ఛైర్మన్ పద్మమ్మ, ఉపాధ్యాయులు, సీఆర్పీఎఫ్ సభ్యులు పెద్దిరెడ్డి, చిన్న తిమ్మప్ప, గోవిందు, మారెన్న తదితరులున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని