logo

Mahbubnagar: వసతి గృహాలు ఏర్పాటు చేయాలి

వేలాది మంది విద్యార్థులు చదువుకునే అయిజ పట్టణంలో బీసీ, ఎస్సీ వసతి గృహాలను ఏర్పాటు చేయాలని భాజపా జిల్లా అధ్యక్షుడు రామచంద్ర రెడ్డి కోరారు.

Published : 28 Jun 2024 17:34 IST

రాజోలి: వేలాది మంది విద్యార్థులు చదువుకునే అయిజ పట్టణంలో బీసీ, ఎస్సీ వసతి గృహాలను ఏర్పాటు చేయాలని భాజపా జిల్లా అధ్యక్షుడు రామచంద్ర రెడ్డి కోరారు. శుక్రవారం భాజపా ఆధ్వర్యంలో అన్ని కళాశాలల విద్యార్థులతో కలసి ఎంపీడీవో కార్యాలయం వద్ద, అధికారులకు, ఎంపీపీకి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా రామచంద్ర రెడ్డి మాట్లాడుతూ.. అయిజ మండలంలో నాలుగు జూనియర్ కళాశాలలు, 2 డిగ్రీ కళాశాలలు, 16 హైస్కూళ్ల విద్యార్థులతో పాటు చుట్టుపక్కల మండలాల నుంచి చదువుకునేందుకు వస్తుంటారని  అన్నారు. వారికి వసతి గృహాలు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే హైదెలు డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అయిజ మండల పట్టణ అధ్యక్షుడు గోపాలకృష్ణ, నరసింహయ్య శెట్టి, ప్రధాన కార్యదర్శులు ప్రదీప్ స్వామి, భగత్ రెడ్డి, జిల్లా కిసాన్ మోర్చా ఉపాధ్యక్షుడు ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని