logo

Mahbubnagar: ఘనంగా ఏరువాక పౌర్ణమి

ఏరువాక పౌర్ణమి వేడుకలను మండల ప్రజలు ఆయా గ్రామాల్లో శనివారం ఘనంగా జరుపుకున్నారు.

Published : 22 Jun 2024 16:48 IST

రాజోలి: ఏరువాక పౌర్ణమి వేడుకలను మండల ప్రజలు ఆయా గ్రామాల్లో శనివారం ఘనంగా జరుపుకున్నారు. రైతులు పంటలు ప్రారంభించే ముందు వచ్చే తొలి పండుగ కావడంతో అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. రాజోలి, మాన్ దొడ్డి, పచ్చర్ల, తుమ్మిళ్ల తదితర గ్రామాలలో రైతులు కాడెద్దులతో ఆలయాలకు వెళ్లి ప్రత్యేక పూజలు చేశారు. పెద్దతాండ్రపాడులో కాడెద్దుల ఊరేగంపు, వాటితో ఉట్టికొట్టే కార్యక్రమం ఉత్సాహంగా సాగింది. రాజోలిలో భక్తులు ఉదయాన్నే ప్రత్యేక స్నానాలు ఆచరించి, పిండి వంటలు చేసి సుంకులమ్మ, మారెమ్మ, పెద్దమ్మ ఆలయాల్లో నైవేద్యాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని