logo

చిరుతను బంధించాలని రాస్తారోకో

మహానంది :  నంద్యాల జిల్లా మహానంది సిరివెళ్ల మండలాల పరిధిలోని నల్లమల అడవిలో గల పచ్చర్ల గ్రామంలో చిరుతను బంధించాలని ప్రజలు రాస్తారోకో చేపట్టారు. 

Published : 26 Jun 2024 12:40 IST

మహానంది :  నంద్యాల జిల్లా మహానంది సిరివెళ్ల మండలాల పరిధిలోని నల్లమల అడవిలో గల పచ్చర్ల గ్రామంలో చిరుతను బంధించాలని ప్రజలు రాస్తారోకో చేపట్టారు. మంగళవారం  వంట చెరకు కోసం అడవిలోకి వెళ్లిన పచ్చర్ల గ్రామానికి చెందిన మాజీ ఉపసర్పంచ్ షేక్ మెహరూన్ బీ (40)పై చిరుత దాడి చేసి హతమార్చింది. నాలుగు రోజుల క్రితం ఇంట్లో నిద్రిస్తున్న  ఇదే గ్రామానికి చెందిన షేక్ బీబీ అనే మహిళ, అటవీ సిబ్బందిపై చిరుత  దాడి చేసింది. దీంతో  గ్రామస్థులు  నంద్యాల-గిద్దలూరు ప్రధాన రహదారిపై రాస్తారోకో చేపట్టారు. చిరుతను బంధించి తమ ప్రాణాలను కాపాడాలని నినదించారు. దీంతో ప్రకాశం- నంద్యాల జిల్లాలకు రాకపోకలు నిలిచిపోయాయి. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని