logo

Kurnool: పోషకాహార లోపంపై శిక్షణ

కృషి విజ్ఞాన కేంద్రం, బనవాసి వారు ఐ.సి.డి.ఎస్, ఎమ్మిగనూరు వారి భాగస్వామ్యంతో అంగన్వాడీ టీచర్లకు గర్భిణి, బాలింత మహిళలలు తీసుకోవల్సిన పోషకాహార లోపాల గురించి శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు.

Updated : 28 Jun 2024 15:47 IST

ఎమ్మిగనూరు వ్యవసాయం: కృషి విజ్ఞాన కేంద్రం, బనవాసి వారు ఐ.సి.డి.ఎస్, ఎమ్మిగనూరు వారి  భాగస్వామ్యంతో అంగన్వాడీ టీచర్లకు గర్భిణి, బాలింత మహిళలలు తీసుకోవల్సిన పోషకాహార లోపాల గురించి శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా డా.పి.అపర్ణ, గృహ విజ్ఞాన శాస్త్ర వేత్త మాట్లాడుతూ.. గర్భిణీ మహిళలలో కలిగే పోషకాహార లోపాలు మఖ్యంగా ఐరన్ లోపిస్తే రక్తహీనత కలుగుతుందని తెలిపారు. సెలీనియం, అయోడిన్, జింక్, బీ12, ఫోలిక్ యాసిడ్ లోపాలు, వాటి నివారణకు తీసుకోవలసిన పోషక ఆహారంపై అవగాహన కల్పించారు. ఈ  కార్యక్రమంలో అర్బన్ సెక్టార్-2, గోనేగండ్ల సెక్టార్-1 అంగన్‌వాడీ  టీచర్లు, సూపర్ వైజర్లు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని