logo

Kurnool: దేవస్థానంలో ఉద్యోగుల సస్పెన్షన్

నంద్యాల జిల్లా మహానంది దేవస్థానంలో ఇద్దరు ఉద్యోగుల సస్పెన్షన్, ముగ్గురు ఏజెన్సీ ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ఈవో నల్ల కాల్వ శ్రీనివాసరెడ్డి తెలిపారు.

Published : 03 Jul 2024 19:33 IST

మహానంది: నంద్యాల జిల్లా మహానంది దేవస్థానంలో ఇద్దరు ఉద్యోగుల సస్పెన్షన్, ముగ్గురు ఏజెన్సీ ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ఈవో నల్ల కాల్వ శ్రీనివాసరెడ్డి తెలిపారు. బుధవారం దేవస్థానంలోని పలు విభాగాలను పరిశీలించారు. అనంతరం రెగ్యులర్ ఉద్యోగులైన రికార్డ్ అసిస్టెంట్ మహేశ్వరమ్మ, అటెండర్ కర్ణా బహదూర్ లను వీధుల్లో నిర్లక్ష్యంగా ఉన్నందుకు సస్పెండ్ చేస్తున్నట్టు తెలిపారు. అదేవిధంగా ఏజెన్సీ ఉద్యోగులుగా ఉన్న మహేష్, చింతల్, ప్రహల్లాద్‌లను మద్యం సేవించి ఉండడంతో తొలగిస్తున్నట్లు చెప్పారు. కౌంటర్ల తనిఖీల్లో భాగంగా లడ్డు ప్రసాద కౌంటరులో 304 లడ్ల నిలువలు తక్కువ, అలాగే కౌంటర్లో రూ.4,190 నగదు తక్కువ ఉండడం బయటపడింది. ఇందులో భాగంగానే చర్యలు చేపట్టడం జరిగిందని ఈవో తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని