logo

Kurnool: సమస్యలు పరిష్కరించాలని ఎమ్మెల్యేకు వినతి

ఆదోని పట్టణంలోని పురపాలక పాఠశాలల్లో నెలకొన్న సమస్యలను భాజపా ఎమ్మెల్యే పార్థసారధికి పురపాలక ఉపాధ్యాయ సంఘం ఫెడరేషన్ నాయకులు బుధవారం విన్నవించారు.

Published : 26 Jun 2024 15:38 IST

ఆదోని మార్కెట్: ఆదోని పట్టణంలోని పురపాలక పాఠశాలల్లో నెలకొన్న సమస్యలను భాజపా ఎమ్మెల్యే పార్థసారధికి పురపాలక ఉపాధ్యాయ సంఘం ఫెడరేషన్ నాయకులు బుధవారం విన్నవించారు. ప్రధానంగా పాఠశాలలో ఉపాధ్యాయుల కొరత అధికంగా ఉందని, వీటి పరిష్కారానికి చొరవచూపాలన్నారు. కొరత ఉన్న చోట ఇతర పాఠశాల నుంచి ఉపాధ్యాయులను డిప్యూటేషన్ పై వేస్తున్నారని, దీనివల్ల పాత పాఠశాలలో ఉపాధ్యాయుల కొరత ఉంటుందని వివరించారు. నిబంధనలకు విరుద్ధంగా డిప్యూటేషన్లు వేస్తున్నారని ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. ఎమ్మెల్యేని కలిసిన వారిలో పురపాలక ఉపాధ్యాయ సంఘం ఫెడరేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి సురేష్ కుమార్, గౌరవాధ్యక్షుడు దస్తగిరి, నూరుగులాక్, ప్రధాన కార్యదర్శి జంగం బసవరాజు, కోశాధికారి కోటన్న, ప్రతాపరెడ్డి, రమేష్ రావు, జ్ఞానమద్దయ్య, బడుగు బసవరాజ్ తదితరులు ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని