logo

ఉద్యోగుల కష్టార్జితాన్ని శిల్పా దోచుకున్నారు : బుడ్డా

శ్రీశైల దేవస్థానంలో పనిచేసే ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల కష్టార్జితాన్ని మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి దోచుకున్నారని ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్‌రెడ్డి ఆరోపించారు. ఆత్మకూరు వెలుగు కార్యాలయంలో బుధవారం పొదుపు సంఘాల ఆర్పీలు, వెలుగు సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు.

Updated : 04 Jul 2024 05:11 IST

సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్‌రెడ్డి

ఆత్మకూరు, న్యూస్‌టుడే : శ్రీశైల దేవస్థానంలో పనిచేసే ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల కష్టార్జితాన్ని మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి దోచుకున్నారని ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్‌రెడ్డి ఆరోపించారు. ఆత్మకూరు వెలుగు కార్యాలయంలో బుధవారం పొదుపు సంఘాల ఆర్పీలు, వెలుగు సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేవస్థానం టీఏ, డీఏలు పోను ఒక్కో ఉద్యోగికి రూ.15 వేలు ఇస్తే శిల్పా కుమారుడి పేరుతో ఉన్న సంస్థ ద్వారా రూ.9 వేలు మాత్రమే ఇచ్చి మిగిలిన డబ్బు స్వాహా చేశారని ధ్వజమెత్తారు. దేవస్థానం పరిధిలో దాదాపు 1500 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారని, వీరిపై నెలకు రూ.కోటి వరకు దోచుకున్నారని ఆరోపించారు. ప్రజలు వైకాపాను నమ్మి అధికారమిస్తే రాష్ట్రంలో రాక్షస పాలన సాగించారని విమర్శించారు. ఐదేళ్లలో ఇంత ఘోరంగా ఓడిన పార్టీ దేశంలో ఎక్కడా లేదన్నారు. పొదుపు సంఘాల సభ్యులు గత ప్రభుత్వంలో కొందరు నాయకుల అండతో అందిన కాడికి భోంచేస్తూ వచ్చారన్నారు. ఇప్పటికైనా రాజకీయాలు తగ్గించి సంఘాలను అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. లేదంటే ప్రక్షాళన చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. కమిషనర్‌ హరిప్రసాద్, తెదేపా నాయకులు గోవిందరెడ్డి, శివరామిరెడ్డి, వేణుగోపాల్, కలీముల్లా, అబ్దుల్లాపురం బాషా తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని