logo

ఆంధ్రను ఆదుకోవాలి

అన్నివిధాలా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని కేంద్రం ఆదుకోవాలని నంద్యాల ఎంపీ, తెదేపా లోక్‌సభ డిప్యూటీ ఫ్లోర్‌లీడర్‌ డా.బైరెడ్డి శబరి కోరారు

Published : 03 Jul 2024 04:04 IST

పార్లమెంట్‌లో ఎంపీ శబరి

నంద్యాల పట్టణం, న్యూస్‌టుడే : అన్నివిధాలా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని కేంద్రం ఆదుకోవాలని నంద్యాల ఎంపీ, తెదేపా లోక్‌సభ డిప్యూటీ ఫ్లోర్‌లీడర్‌ డా.బైరెడ్డి శబరి కోరారు. గత ఐదేళ్లలో రాష్ట్రం నాశనమైందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. లోక్‌సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం సందర్భంగా డా.శబరి తొలిసారి మంగళవారం మాట్లాడారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌ రాజధాని లేని రాష్ట్రంగా మిగిలిందన్నారు. గత వైకాపా ప్రభుత్వం అమరావతిని పట్టించుకోలేదన్నారు. మూడు రాజధానుల పేరుతో కాలయాపన చేసిందని విమర్శించారు. పోలవరాన్ని నాశనం చేసిందని ధ్వజమెత్తారు. వెనుకబడిన రాయలసీమకు ఒక్క పరిశ్రమ కూడా తీసుకురాలేక పోయిందన్నారు. కక్ష సాధింపు రాజకీయాలు, అవినీతి తప్ప గత ఐదేళ్ల వైకాపా పాలనలో రాష్ట్రంలో అభివృద్ధేమీ జరగలేదన్నారు. అన్నివిధాలా నష్టపోయిన రాష్ట్రాన్ని కేంద్రం ఆదుకోవాలని కోరారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని