logo

సత్వర విచారణ..బాధితులకు రక్షణ

పాత చట్టాల స్థానంలో కేంద్రం తీసుకొచ్చిన కొత్త చట్టాలు అమలులోకి వచ్చాయి. ఇవి బాధితులకు కొండంత అండగా నిలవనున్నాయి

Published : 03 Jul 2024 04:01 IST

అమలు లోకి వచ్చిన నూతన చట్టాలు

న్యూస్‌టుడే, కర్నూలు నేరవిభాగం, న్యాయవిభాగం: పాత చట్టాల స్థానంలో కేంద్రం తీసుకొచ్చిన కొత్త చట్టాలు అమలులోకి వచ్చాయి. ఇవి బాధితులకు కొండంత అండగా నిలవనున్నాయి. నేరగాళ్లకు త్వరితగతిన శిక్ష పడటంతోపాటు బాధితులకు సత్వర న్యాయం అందనుంది. నేరాలు, ఘోరాలకు కళ్లెం పడనుంది. మరోవైపు న్యాయ వ్యవస్థలో ప్రజలు  కోరుకునే మార్పు కనిపించనుంది.

ఆన్‌లైన్‌లోనే కేసుల నమోదు

బాధితులు పోలీసుస్టేషన్‌కు స్వయంగా వెళ్లి ఫిర్యాదు చేయాల్సిన అవసరం లేదు. వాట్సప్, ·îుయిల్, ట్విట్టర్‌.. ఇతర సామాజిక మాధ్యమాల ద్వారా ఫిర్యాదు చేసే సౌకర్యం కల్పించారు. కేసు నమోదు, విచారణ తదితర వ్యవహారాలు ఆన్‌లైన్‌లో నమోదు కానున్నాయి.

ఎక్కడైనా ఫిర్యాదు చేయొచ్చు

జీరో ఎఫ్‌ఐఆర్‌ ప్రకారం బాధితులు ఎవరైనా దేశంలోని ఏ పోలీసుస్టేషన్‌లోనైనా.. ఎలాగైనా ఫిర్యాదు చేయొచ్చు. గతంలో ఇది అమలులో ఉన్నప్పటికీ సరిగా అమలు కాలేదు. ఇకనుంచి పక్కాగా అమలు చేయనున్నారు. జీరో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసిన పోలీసులు తర్వాత సంబంధిత పోలీసుస్టేషన్‌కు బదిలీ చేస్తారు. సదరు స్టేషన్‌ పోలీసులు తిరిగి వివరాలు నమోదు చేసుకుంటున్నారు. ఫిర్యాదుదారుని సంతకం తీసుకోలేకపోతే కుటుంబసభ్యులు, బంధువుల సంతకం తీసుకోవచ్చు. కేసు నమోదైన తర్వాత బాధితుడికి ఎఫ్‌ఐఆర్‌ ప్రతి ఉచితంగా ఇవ్వాలి. బాధ్యులపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో సంబంధిత దర్యాప్తు అధికారి ఫిర్యాదుదారునికి తప్పనిసరిగా తెలపాలి. బాధితులు ఎంతమంది ఉంటే అంతమందికి ఎఫ్‌ఐఆర్‌ ప్రతి ఇవ్వాలి. 90 రోజుల్లో దర్యాప్తు పురోగతిని అధికారులు డిజిటల్‌ రూపంలో లేదా ఇతర విధానంలో సమాచారం ఇవ్వాలి. దర్యాప్తు పూర్తికాకపోతే కాకపోతే కారణాలు వివరించాల్సి ఉంది.

వివరాలు వెల్లడించాల్సిందే..

అరెస్టైన నిందితుల వివరాలనరెండు నెలల్లో దర్యాప్తు పూర్తవ్వాలి మహిళలు, చిన్నారుల బాధిత కేసులకు సంబంధించి రెండు నెలల్లో దర్యాప్తు పూర్తవ్వాలి. బాధిత మహిళలకు, చిన్నారులకు ఉచితంగా చికిత్స అందించాలి. కేసు విచారణలో ఆలస్యాన్ని నివారించేందుకు కోర్టులు గరిష్ఠంగా రెండు వాయిదాలు వేయాలి. ఈ మేరకు ట్రయల్‌ ప్రక్రియ త్వరితగతిన జరగనుంది. బాధితులకు సత్వర న్యాయం అందనుంది.

ఉన్నచోటు నుంచే పోలీసు సేవలు

మహిళలు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, 15 ఏళ్లలోపువారు, 60 ఏళ్లు పైబడినవారు పోలీసుస్టేషన్‌కు వెళ్లాల్సిన అవసరం లేదు. వారు ఉన్నచోటు నుంచే ఫోన్‌ చేసిగానీ.. సామాజిక మాధ్యమాల ద్వారా సమాచారం ఇచ్చి పోలీసు సేవలు పొందవచ్చు. పలు కేసుల్లో పోలీసుస్టేషన్లకు వెళ్లలేని బాధితులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు

 వారి కుటుంబసభ్యులు, సన్నిహితులకు తప్పనిసరిగా తెలపాల్సి ఉంటుంది. గతంలో ఈ విధానం ఉన్నప్పటికీ సరిగా అమలుచేయలేదు. ఇకనుంచి అరెస్టు చేసిన అధికారులు తప్పనిసరిగా నిబంధన పాటించి ఫోన్‌ ద్వారాగానీ.. సామాజిక మాధ్యమాల ద్వారా నిందితుడి కుటుంబసభ్యులకు సమాచారం ఇవ్వాలి. ఫలితంగా నిందితుడు పలు సహాయాలు అందే అవకాశం ఉంటుంది.

అరెస్టు చేసిన నిందితుల వివరాలను జిల్లా ఉన్నతాధికారులకు తెలపాల్సి ఉంటుంది. గతంలో చిన్నచిన్న కేసుల్లో నిందితుల అరెస్టు వివరాలు తెలిపేవారు కాదు. ఇకనుంచి ప్రతి కేసు, నిందితుడి అరెస్టు సమాచారం తెలియజేయాల్సి ఉంది. ప్రతిరోజు.. ప్రతి కేసు సీసీఆర్‌బీ, డీసీఆర్‌బీలో నమోదు చేస్తారు.

కఠిన చర్యలు 

సమన్లు నేరుగా ఇళ్ల వద్దకు వెళ్లి ఇవ్వాల్సిన అవసరం లేదు. సామాజిక మాధ్యమాల ద్వారా చేరవేయొచ్చు. ఇదివరకు కోర్టు విచారణ దశ సమయంలో బాధితులను స్వయంగా కలిసి సమన్లు అందించేవారు. సాక్షులకు రక్షణ కల్పించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలకు అప్పగించారు. సాక్షులను ఎవరైనా బెదిరించినా, దాడులకు పాల్పడినా కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది.

పేర్లు మార్పు.. పెరిగిన సెక్షన్లు

ఐపీసీలో 511 సెక్షన్లు ఉంటే వాటి స్థానంలో వచ్చిన భారత న్యాయ సంహిత (బీఎన్‌ఎస్‌)లో 358 సెక్షన్లు ఉంటాయి. సీఆర్‌పీసీలో 484 సెక్షన్లు ఉంటే దానిస్థానంలో అమలులోకి వచ్చిన భారతీయ నాగరిక్‌ సురక్షా సంహిత (బీఎన్‌ఎస్‌ఎస్‌)లో 531 సెక్షన్లు ఉన్నాయి. భారత సాక్ష్యాధార చట్టంలో 167 సెక్షన్లు ఉంటే దానిస్థానంలో వచ్చిన భారతీయ సాక్షా అధినియంలో 170 సెక్షన్లు ఉన్నాయి.

  వీడియోతో చిత్రీకరణ

తీవ్రమైన నేరాల్లో విచారణను యాప్‌ ద్వారా వీడియో చిత్రీకరణ తప్పనిసరి చేశారు. వాంగ్మూలాలు ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో నిక్షిప్తమవుతాయి. తారుమారు చేసేందుకు వీలుండదు. దర్యాప్తు పారదర్శకంగా ఉంటుంది. హత్య, దోపిడీ ఇతరత్రా కేసుల్లో ఫొటోగ్రఫీ, వీడియో చిత్రీకరణ తప్పనిసరిగా చేయాల్సి ఉంటుంది. అత్యాచారం కేసులో బాధితురాలి వాంగ్మూలానికి సంబంధించి ఆడియో, వీడియో ద్వారా చిత్రీకరణ చేయాల్సి ఉంటుంది.


శిక్షలు పక్కాగా అమలు 
- పి.సుస్మిత, పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌

కొత్త చట్టాలతో కేసులు త్వరితగతిన పరిష్కారం కావటంతోపాటు బాధితులకు సత్వర న్యాయం అందనుంది. బాధితులు పోలీసుస్టేషన్‌కు వెళ్లకుండా ఫిర్యాదు చేసి న్యాయం పొందవచ్చు. కేసు నమోదు చేసిన 14 రోజుల్లో కేసు ఓ కొలిక్కి తీసుకురావాలి. దర్యాప్తులో అనుసరించే ఆధునిక సాంకేతిక విధానాలు ట్రయల్‌ సమయంలో దోహదపడనున్నాయి. శిక్షలు పక్కాగా అమలవుతాయి. చోరీ, మోసం కేసులో రికవరీ చేసేందుకు పోలీసులకు అవకాశం కల్పించటంతో బాధితులకు న్యాయం జరగనుంది. కొత్త చట్టాలపై ప్రజలు అవగాహన పెంచుకుని సద్వినియోగం చేసుకోవాలి. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని