logo

బాల మేధావులు.. బంగారు కొండలు

చిక్కుముడులు చకచకా విప్పేస్తారు. ఎంత పెద్ద లెక్కైనా.. వారికి లెక్కేలేదు. పోటీల్లో ఆ చిన్నారులకు ఎదురే లేదు. బరిలో దిగారా.. బహుమతి వచ్చి వాలాల్సిందే.

Published : 03 Jul 2024 03:51 IST

జాతీయ స్థాయి ఒలింపియాడ్‌ పోటీల్లో ప్రతిభ 
పతకాలు ఆ చిన్నారుల సొంతం 

ప్రశంసాపత్రాలతో విద్యార్థులు  

న్యూస్‌టుడే, ఆదోని : విద్యచిక్కుముడులు చకచకా విప్పేస్తారు. ఎంత పెద్ద లెక్కైనా.. వారికి లెక్కేలేదు. పోటీల్లో ఆ చిన్నారులకు ఎదురే లేదు. బరిలో దిగారా.. బహుమతి వచ్చి వాలాల్సిందే. చదువుకు ఎంతగానో ఉపయోగపడుతోంది వారి ప్రతిభ. ఆదోని పట్టణానికి చెందిన ముగ్గురు చిన్నారులు జాతీయ స్థాయిలో నిర్వహించిన ఇండియా టాలెంట్‌ ఒలింపియాడ్‌ పోటీల్లో ప్రతిభ చూపి, కనబరచి బంగారు పతకాలు, ప్రోత్సాహక బహుమతులు సొంతం చేసుకున్నారు. విద్యార్థుల విజయంపై ప్రత్యేక కథనం. 

ఆషియాకు ప్రశంసల జల్లు 

ఆదోని పట్టణానికి చెందిన బేల్దారు మహమ్మద్‌ సలీం, షబానా దంపతుల కుమార్తె బేల్దారు ఆషియా సిద్దిఖా మూడో తరగతి చదువుతోంది. ఈ విద్యార్థిని గణితంలో చురుగ్గా ఉండటంతో ప్రతిభను గుర్తించిన పాఠశాల ఉపాధ్యాయులు మరింత ప్రోత్సహించి తర్ఫీదు ఇచ్చారు. జాతీయ స్థాయిలో జరిగే ఇండియన్‌ టాలెంట్‌ ఒలింపియాడ్‌ మ్యాథమెటిక్స్‌ విభాగం పోటీల్లో ఈ విద్యార్థినీ పాల్గొని పోటీ పరీక్షలు రాసి ప్రతిభ చాటింది. ఈ పోటీల్లో జాతీయ స్థాయి జూనియర్‌ విభాగంలో తొమ్మిదో ర్యాంకు సాధించి శభాష్‌ అనిపించుకుంది. ప్రతిభ చాటడంతో ఒలింపియాడ్‌ సంస్థ నిర్వాహకులు బంగారు పతకం, ప్రోత్సాహక బహుమతి, ధ్రువపత్రం ప్రదానం చేశారు. 

జైదీ విజయం 

ఆదోని పట్టణానికి చెందిన జహీర్, రజియా సుల్తానా కుమార్తె ఎస్‌.ఉస్మా జైదీ నాలుగో తరగతి చదువుతోంది. విద్యార్థిని చదువులో ప్రతిభ చూపుతుండటంతో ఉపాధ్యాయులు ప్రోత్సాహం అందించారు. జాతీయ స్థాయిలో జరిగిన ఆల్‌ ఇండియా ఒలింపియాడ్‌ సైన్స్‌ పోటీల్లో జూనియర్‌ విభాగంలో ప్రాతినిధ్యం వహించిన విద్యార్థి జైదీ జాతీయ స్థాయిలో 18వ ర్యాంకు సాధించి తన ప్రతిభ చాటింది. సంస్థ నిర్వాహకులు బంగారు పతకం, ధ్రువపత్రం, ప్రోత్సాహక బహుమతి అందించారు. 

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని