logo

ఓర్వకల్లు పొదుపు మహిళల స్ఫూర్తి ఆదర్శనీయం

చేతికష్టం నుంచి నెలవారీగా పొదుపు చేస్తూ ఆర్థిక పరిపుష్టి సాధించిన ఓర్వకల్లు పొదుపు మహిళల స్ఫూర్తి దేశానికే ఆదర్శమని కలెక్టర్‌ రంజిత్‌బాషా, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి, తెదేపా నంద్యాల జిల్లా అధ్యక్షుడు మల్లెల రాజశేఖర్‌ అన్నారు.

Published : 03 Jul 2024 03:40 IST

జ్యోతి వెలిగిస్తున్న పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి, కలెక్టర్‌ రంజిత్‌బాషా, వేదికపై తెదేపా నంద్యాల జిల్లా అధ్యక్షుడు మల్లెల రాజశేఖర్‌ తదితరులు

ఓర్వకల్లు, న్యూస్‌టుడే: చేతికష్టం నుంచి నెలవారీగా పొదుపు చేస్తూ ఆర్థిక పరిపుష్టి సాధించిన ఓర్వకల్లు పొదుపు మహిళల స్ఫూర్తి దేశానికే ఆదర్శమని కలెక్టర్‌ రంజిత్‌బాషా, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి, తెదేపా నంద్యాల జిల్లా అధ్యక్షుడు మల్లెల రాజశేఖర్‌ అన్నారు. ఓంప్లిస్‌ (ఓర్వకల్లు పొదుపు లక్ష్మి ఐక్య సంఘం) ఆధ్వర్యంలో రజతోత్సవ వేడుకలను మంగళవారం నిర్వహించారు. ఓంప్లిస్‌ గౌరవ సలహాదారురాలు విజయభారతి అధ్యక్షతన వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా బాలభారతి పాఠశాలలో వెంకటేశ్వరస్వామికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కలెక్టర్, ఎమ్మెల్యే జ్యోతి వెలిగించి మాట్లాడారు. ఓర్వకల్లు పొదుపు మహిళలు సంఘాల ఏర్పాటుతో ఆర్థిక విజయం సాధించటంతోపాటు దేశంలోని పలు రాష్ట్రాల్లో సంఘాలు ఏర్పాటుచేసి అక్కడి మహిళలకు పొదుపు పాఠాలు నేర్పి ఆదర్శంగా నిలిచారన్నారు. పొదుపు సంఘాల ఏర్పాటుకు ప్రస్తుత ముఖ్యమంత్రి, తెదేపా అధినేత చంద్రబాబునాయుడు అప్పట్లోనే నాంది పలికారని చెప్పారు. మహిళా సంక్షేమానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పెద్దపీట వేశారన్నారు. అంతకు ముందు విజయభారతి మాట్లాడుతూ మండలంలో 22 గ్రామాల్లోని వెయ్యి సంఘాల్లో 12 వేల మంది మహిళలు ఉన్నారన్నారు. మహిళా బ్యాంకు ద్వారా రూ.3 కోట్ల లావాదేవీలు నిర్వహిస్తున్నట్లు వివరించారు.  తహసీల్దారు నటరాజ్, ఎంపీడీవో మల్లేశ్వరి, సర్పంచులు మోహన్‌రెడ్డి, వెంకటరమణ, చంద్ర గోవర్ధనమ్మ, వెలుగు పీడీ సలీంబాషా, తెదేపా నంద్యాల జిల్లా మహిళా అధ్యక్షురాలు పార్వతమ్మ, తెదేపా మండల కన్వీనర్‌ గోవిందరెడ్డి, ఆర్‌యూ విద్యార్థి సంఘాల ఐకాస కన్వీనర్‌ శ్రీరాములు, సీనియర్‌ నాయకులు సుధాకరరెడ్డి, లక్ష్మీకాంతారెడ్డి తదితరలున్నారు.
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని