logo

వాటిల్లో విద్యుత్తు బిల్లులు చెల్లించొద్దు

విద్యుత్తు బిల్లులు ఆన్‌లైన్‌ ద్వారా చెల్లించేందుకు ఆర్‌బీఐ కొత్త మార్గదర్శకాలు విడుదల చేసిందని విద్యుత్తు శాఖ ఏఏవో మల్లికార్జున, జేఏవో రామరాజు తెలిపారు.

Published : 03 Jul 2024 03:18 IST

వాటిల్లో విద్యుత్తు బిల్లులు చెల్లించొద్దు

 

 

 

 

వినియోగదారులకు అవగాహన కల్పిస్తున్న అకౌంట్స్‌ అధికారులు 

కర్నూలు (వెంకటరమణ కాలనీ), న్యూస్‌టుడే : విద్యుత్తు బిల్లులు ఆన్‌లైన్‌ ద్వారా చెల్లించేందుకు ఆర్‌బీఐ కొత్త మార్గదర్శకాలు విడుదల చేసిందని విద్యుత్తు శాఖ ఏఏవో మల్లికార్జున, జేఏవో రామరాజు తెలిపారు. కర్నూలులోని పవర్‌హౌస్‌ బిల్లింగ్‌ కేంద్రం వద్ద వినియోగదారులకు మంగళవారం అవగాహన కల్పించారు. ఆయన మాట్లాడుతూ విద్యుత్తు బిల్లులను ఇకనుంచి గూగుల్‌పే, ఫోన్‌పే, పేటీఎం, యూపీఐ ద్వారా నేరుగా చెల్లించేందుకు వీలుండదని చెప్పారు. ఏపీఎస్పీడీసీఎల్‌ యాప్‌ ద్వారాగానీ.. ఏపీఎస్పీడీసీఎల్‌ బిల్‌డెస్క్‌ యాప్‌ల ద్వారా చెల్లించాల్సి ఉంటుందన్నారు. యజమాని చరవాణి నంబరుతో మాత్రమే యాప్‌ను రిజిస్టరు చేసుకోవాల్సి ఉంటుందన్నారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని