logo

అసాధ్యాన్ని సుసాధ్యం చేశాం

సార్వత్రిక ఎన్నికల ముందు తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు ఇచ్చిన వాగ్దానం మేరకు సూపర్‌ సిక్స్‌ పథకాల్లో ఒకటైన ఎన్టీఆర్‌ భరోసా సామాజిక పింఛన్ల పెంపు ఒకటని కర్నూలు పార్లమెంట్‌ నియోజకవర్గ తెదేపా అధ్యక్షుడు పాలకుర్తి తిక్కారెడ్డి అన్నారు.

Published : 02 Jul 2024 05:01 IST

కర్నూలు గాయత్రీ ఎస్టేట్‌లో పింఛను అందజేస్తున్న కర్నూలు పార్లమెంటు నియోజకవర్గ తెదేపా అధ్యక్షుడు తిక్కారెడ్డి,

ఎమ్మెల్సీ బీటీ నాయుడు, తెదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమిశెట్టి, కమిషనర్‌ భార్గవ్‌తేజ తదితరులు

కర్నూలు సచివాలయం, న్యూస్‌టుడే: సార్వత్రిక ఎన్నికల ముందు తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు ఇచ్చిన వాగ్దానం మేరకు సూపర్‌ సిక్స్‌ పథకాల్లో ఒకటైన ఎన్టీఆర్‌ భరోసా సామాజిక పింఛన్ల పెంపు ఒకటని కర్నూలు పార్లమెంట్‌ నియోజకవర్గ తెదేపా అధ్యక్షుడు పాలకుర్తి తిక్కారెడ్డి అన్నారు. ఎమ్మెల్సీ బీటీ నాయుడు, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమిశెట్టి వెంకటేశ్వర్లు, పార్టీ నగర అధ్యక్షుడు నాగరాజు యాదవ్, కేవీ సుబ్బారెడ్డితో కలిసి నగరంలోని గాయత్రీ ఎస్టేట్, బిర్లాగడ్డ ప్రాంతాల్లో సోమవారం తెల్లవారుజామున ఇంటింటికి వెళ్లి సామాజిక పింఛన్లు పంపిణీ చేశారు. ముందుగా తెదేపా కార్యాలయం వద్ద ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. వారు మాట్లాడుతూ పెంచిన ఫించను మొత్తం అందించడంతో పింఛనుదారుల్లో ఆనందం నెలకొందని చెప్పారు. అసాధ్యమన్న జగన్‌ మాటలను సుసాధ్యం చేయడంలో ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఎవరూ సాటిరారని చెప్పారు. త్వరలో అన్న క్యాంటీన్లు ప్రారంభించి పేదల ఆకలి తీర్చనున్నట్లు పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు విజన్‌ ఉన్న నేత అని.. పరిపాలన అనుభవమున్న నాయకుడు కావడంతోనే ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని చెప్పారు. డీఆర్డీఏ పీడీ సలీంబాషా, కర్నూలు పార్లమెంట్‌ నియోజకవర్గ తెలుగు మహిళ అధ్యక్షురాలు ఎస్‌.ముంతాజ్‌ పాల్గొన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని