logo

కొత్త నేర చట్టాలపై అవగాహన తప్పనిసరి

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త నేర చట్టాలపై తప్పనిసరిగా అవగాహన కలిగి ఉండాలని ఎస్పీ జి.కృష్ణకాంత్‌ అధికారులు, సిబ్బందికి సూచించారు.

Published : 02 Jul 2024 04:59 IST

మాట్లాడుతున్న ఎస్పీ జి.కృష్ణకాంత్‌

ఉలిందకొండ (కల్లూరు గ్రామీణ), న్యూస్‌టుడే: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త నేర చట్టాలపై తప్పనిసరిగా అవగాహన కలిగి ఉండాలని ఎస్పీ జి.కృష్ణకాంత్‌ అధికారులు, సిబ్బందికి సూచించారు. కల్లూరు మండలం ఉలిందకొండ పోలీస్‌స్టేషన్‌ ఆవరణలో నూతన చట్టాలపై సోమవారం నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఎస్పీ మాట్లాడారు. బాధితులకు సత్వర న్యాయం అందించేందుకు వీలుగా ఈ చట్టాల్లో కీలక మార్పులు తీసుకొచ్చారన్నారు. ఈ చట్టాలపై విద్యార్థులు, ఉద్యోగులు, పోలీసులు, సిబ్బంది ప్రతిఒక్కరూ అవగాహన కలిగి ఉండాలన్నారు. ప్రతి సబ్‌ డివిజన్‌లో పోలీసు అధికారులు, సిబ్బందికి కొత్త చట్టాలపై శిక్షణ తరగతులు నిర్వహిస్తామన్నారు. నిందితుల అరెస్టు, వాంగ్మూలం నమోదులో పాటించాల్సిన జాగ్రత్తలు, నిందితులకు శిక్షల ఖరారు, కేసుల దర్యాప్తు అధికారులు వ్యవహరించాల్సిన తీరు తదితర అంశాలను ఎస్పీ వివరించారు. ఈ కార్యక్రమంలో స్పెషల్‌ బ్రాంచ్‌ సీఐ ప్రసాద్, కర్నూలు రూరల్‌ సీఐ కిరణ్‌కుమార్‌రెడ్డి, ఉలిందకొండ ఎస్సై నరేశ్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని