logo

వినతులు త్వరితగతిన పరిష్కరించాలి

ప్రజా వినతులను వేగంగా పరిష్కరించాలని కలెక్టర్‌ పి.రంజిత్‌ బాషా ఆదేశించారు. కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు.

Published : 02 Jul 2024 04:58 IST

ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తున్న కలెక్టర్‌ పి.రంజిత్‌బాషా

కర్నూలు సచివాలయం, న్యూస్‌టుడే: ప్రజా వినతులను వేగంగా పరిష్కరించాలని కలెక్టర్‌ పి.రంజిత్‌ బాషా ఆదేశించారు. కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుంచి వినతులను కలెక్టర్, జేసీ నారపురెడ్డి మౌర్య స్వీకరించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ వచ్చిన అర్జీలను నిర్ణీత గడువులోగా పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో డీఆర్వో మధుసూదన్‌రావు, జిల్లా స్థాయి అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

అతిసారం నియంత్రించాలి

కర్నూలు సచివాలయం, న్యూస్‌టుడే : అతిసారం నియంత్రణలో భాగంగా ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, విలేజ్‌ హెల్త్‌ క్లినిక్‌లు, అంగన్‌వాడీ కేంద్రాల్లో ఓఆర్‌ఎస్, జింక్‌ మాత్రలు అందుబాటులో ఉంచాలని.. అతిసారంపై ప్రజలకు అవగాహన కల్పించాలని కలెక్టర్‌ పి.రంజిత్‌బాషా అన్నారు. అతిసారా వ్యాధికి సంబంధించిన గోడపత్రాలను జేసీ నారపురెడ్డి మౌర్య, డీఆర్వో మధుసూదన్‌రావుతో కలిసి ఆవిష్కరించారు.

ప్రతి శుక్రవారం నీటి తొట్టెలను శుభ్రం చేసి ఆరిన తర్వాత మళ్లీ నీరు నింపడం ద్వారా డెంగీని ప్రాథమిక దశలోనే అరికట్టే అవకాశముందని కలెక్టర్‌ పి.రంజిత్‌ బాషా అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని