logo

నగరంలో 94.71 శాతం పింఛన్ల పంపిణీ

జిల్లా వ్యాప్తంగా పకడ్బందీగా పింఛన్లు పంపిణీ చేసేలా అధికారులు, సిబ్బంది చర్యలు తీసుకున్నారని కలెక్టర్‌ రంజిత్‌బాషా అన్నారు.

Published : 02 Jul 2024 04:39 IST

బుధవారపేటలో పింఛను సొమ్ము అందజేస్తున్న కలెక్టర్‌  రంజిత్‌బాషా, నగరపాలక కమిషనర్‌ భార్గవ్‌తేజ

కర్నూలు నగరపాలకసంస్థ, న్యూస్‌టుడే : జిల్లా వ్యాప్తంగా పకడ్బందీగా పింఛన్లు పంపిణీ చేసేలా అధికారులు, సిబ్బంది చర్యలు తీసుకున్నారని కలెక్టర్‌ రంజిత్‌బాషా అన్నారు. కర్నూలు బుధవారపేటలో నగరపాలక కమిషనర్‌ భార్గవ్‌తేజతో కలిసి సోమవారం పింఛన్లు పంపిణీ చేశారు. నగరంలో ఎన్టీఆర్‌ భరోసా పింఛన్ల పంపిణీ 94.71 శాతం పూర్తి చేసినట్లు కమిషనర్‌ భార్గవ్‌తేజ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీఏ పీడీ సలీంబాషా తదితరులు పాల్గొన్నారు.

సమాచార శాఖ అధికారుల నిర్లక్ష్యం

కలెక్టరేట్‌కు కూత వేటు దూరంలోని బుధవారపేటలో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో కలెక్టర్‌ రంజిత్‌బాషా పాల్గొనగా సమాచార శాఖ అధికారులు ఎవరూ హాజరుకాలేదు. కనీసం ఫొటోగ్రాఫర్లు సైతం హాజరుకాలేదని సమాచారం. చివరికి నగరపాలకకు చెందిన ఫొటోగ్రాఫర్ల నుంచి చిత్రాలు సేకరించుకోవడం గమనార్హం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని